ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి టాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య సినిమా టికెట్ల వివాదం పెరుగుతూనే ఉంది. ఇప్పటి కే హీరోలు నాని, సిద్దార్థ్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు సినిమా టికెట్ల పై ఏపీ ప్రభుత్వం పై కామెంట్స్ చేస్తున్నారు. తాజా గా మరో హీరో నిఖిల్ కూడా సినిమా టికెట్ల వ్యవహారం పై కామెంట్స్ చేశాడు. థీయేటర్స్ తనకు దేవాలయంతో సమానం అని అన్నారు. ఏపీలో థీయేటర్లు మూత పడటం చూస్తుంటే బాధగా ఉందని హీరో నిఖిల్ అన్నారు. సినిమా థీయేటర్స్ లలో రూ. 20 టికెట్స్ నుంచి ఉంటాయని అన్నారు.
Advertisement
Advertisement
దీని వల్ల అన్ని వర్గాల ప్రజలకు సినిమా చూసే అవకాశం ఉంటుందని అన్నారు. అలాగే ట్రైన్ లో ఉండే కంపార్ట్ మెంట్ ల ఆధారంగా సినిమా థీయేటర్స్ లలో బాల్కనీ, ప్రీమియర్ సెక్షన్ల టికెట్ల ధరలలో మార్పులు చేయాలని హీరో నిఖిల్ అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలా ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల విషయంలో మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కాగ హీరో నిఖిల్ నటించిన సినిమా 18 పేజీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే కార్తికేయా – 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
read more .. వీజే సన్నీ తల్లిదండ్రులు ఎలా విడిపోయారో తెలుసా? సన్నీ ఎమోషనల్