2020లో పెరిగిన ధరలతోనే సామాన్యుడి నడ్డి విరిగింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, మరియు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్నింటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే కొత్త సంవత్సరంలో సామాన్యుడిపై భారం మరింత పెరగనుంది. 2022 జనవరి 1 నుండి పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా చెప్పులు, దుస్తుల ధరలు న్యూయర్ నుండి పెరగనున్నాయి. దుస్తులపై జీఎస్టి రేటును 5 శాతం నుండి 12 శాతానికి పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సేస్ నోటిఫై చేసింది.
Advertisement
Advertisement
దాంతో కొత్త సంవత్సరంలో వస్త్రాల ధరలు పెరగనున్నాయి. కానీ నిర్దిష్ట సింథటిక్, ఫైబర్ ల ధరలను 18 శాతం నుండి 12 శాతంకు తగ్గించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ లో జరిగింది. ఈ సమావేశంలో టెక్స్టైల్స్, పాదరక్షల పై విధించే పన్నులో సవరణలు చేశారు. దాంతో దుస్తులపై జిఎస్టి 12 శాతానికి పెరగనుంది.
కాగా గతంలో 5 శాతం జీఎస్టీ విధించేవారు. అంతేకాకుండా వచ్చే ఏడాది నుండి ఆన్లైన్ ద్వారా వస్తువులను అమ్ముతున్న సంస్థల నుండి కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అంతేకాకుండా ఆన్లైన్లో క్యాబ్ ఆటో రిక్షా ద్వారా ప్రయాణించే వారి నుండి కూడా జిఎస్టి వసూలు చేయనున్నారు. అదేవిధంగా స్విగ్గి, జొమాటో లాంటి ఈ కామర్స్ సర్వీసుల పై రెస్టారెంట్ సేవలపై కూడా జీఎస్టీ విధించనున్నారు.