ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ ధరలను ప్రభుత్వం నియంత్రిస్తున్న సంగతి తెలిసిందే. దీనిని పలువురు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఖండిస్తున్నా సర్కార్ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని థియేటర్లు సొంతంగా బంద్ ను కూడా ప్రకటిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి, ధియేటర్లను బట్టి టికెట్ రేట్లను ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం… రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా లో ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్లలో ఎకానమీ టికెట్ ధర రూ. 75, డీలక్స్ రూ. 150, ప్రీమియం రూ. 250 గా ఉన్నాయి.
Advertisement
Advertisement
అదేవిధంగా ఏసిలో ఎకానమీ రూ.40, డీలక్స్ రూ.60, ప్రీమియం రూ.100 గా ఉన్నాయి. నాన్ ఏసి చూసుకున్నట్లయితే ఎకానమీ రూ.20. డీలక్స్ రూ.40. ప్రీమియం రూ.60 గా ఉన్నాయి. ఇక మున్సిపాలిటీ ఏరియాలో మల్టీప్లెక్స్ లో ఎకానమీ రూ.60, డీలక్స్ రూ.100, ప్రీమియం రూ.150 గా ఉన్నాయి. ఏసీలో ఎకానమీ రూ. 30, డీలక్స్ రూ.50, ప్రీమియం రూ.70 గా ఉన్నాయి. అదేవిధంగా నాన్ ఏసీలో చూసినట్లయితే ఎకానమీ రూ.15, డీలక్స్ రూ.30, ప్రీమియం రూ.50 గా ఉన్నాయి.
అధేవిధంగా నగర పంచాయతీల్లో మల్టీప్లెక్స్ లో ఎకానమీ రూ.40, డీలక్స్ రూ.80, ప్రీమియం రూ.120 గా ఉన్నాయి. అదేవిధంగా ఏసీలో ఎకానమీ రూ.15, డీలక్స్ రూ.25, ప్రీమియం రూ.35 గా ఉన్నాయి. నాన్ ఏసీలో చూసినట్లయితే ఎకానమీ రూ. 10, డీలక్స్ రూ.15, ప్రీమియం రూ.25 గా ఉన్నాయి. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న థియేటర్లలో మల్టీప్లెక్స్ లో అయితే ఎకానమీ రూ.30, డీలక్స్ రూ.50, ప్రీమియం రూ.80 గా ఉన్నాయి. అదేవిధంగా ఏసీలో డీలక్స్ రూ.15, ప్రీమియం రూ. 20,ఎకానమీ రూ.5 గా ఉన్నాయి. నాన్ ఏసీలో ఎకానమీ రూ.5, డీలక్స్ రూ.10, ప్రీమియం రూ.15 గా ఉన్నాయి.