ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ లలో యమున కూడా ఒకరు. ఆ తర్వాత యమున క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సీరియల్స్ మరియు సినిమాల్లో నటించింది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా ఉండటంతో ప్రేక్షకులు యమునను దగ్గర చేసుకున్నారు. అయితే కెరీర్ పిక్స్ లో ఉన్న సమయంలో యమున వ్యభిచా* ఆరోపణలతో కెరీర్ ను నాశనం చేసుకుంది.
Advertisement
2011లో బెంగళూరులోని ఓ హోటల్ లో యమున పట్టుబడింది అంటూ అప్పట్లో వార్తలు సంచలనం రేపాయి. దాంతో యమున సినిమా మరియు సీరియల్ ఆఫర్లను కోల్పోయింది. అయితే ఆ కేసు నుండి తొందరగానే బయటపడింది. అంతేకాకుండా ఆ విషయంలో తన తప్పేమీ లేదని కావాలని తనను ఇరికించారని అనేకసార్లు ఇంటర్వ్యూలలో వెల్లడించింది.
Advertisement
అయితే తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ యమున ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సంఘటన తాలూకు బాధ ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందంటూ ఎమోషనల్ అయింది. ఆ రోజు అసలు ఏం జరిగిందన్నది ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పేసానని తెలిపింది. ఆ విషయంలో న్యాయస్థానం కూడా తనకు క్లీన్ చీట్ ఇచ్చిందని వెల్లడించింది. కానీ సోషల్ మీడియాను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికి తన గురించి ఆ సంఘటన గురించి చెత్త థంబ్ నెయిల్స్ తో వీడియోలు పెడుతున్నారని ఎమోషనల్ అయింది. అవి చూస్తుంటే చాలా బాధేస్తుందని… ఎంత మోటివేట్ చేసుకున్నప్పటికీ నేను కూడా ఓ మనిషినే… ఒకవేళ నేను చనిపోయినా వీళ్ళు నన్ను వదలరేమో అనిపిస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక ప్రస్తుతం యమున చేసిన కమెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.