ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్ సినిమాలు వచ్చే ఏడాది 2022 జనవరిలో రిలీజ్ కాబోతున్నాయి. జనవరి 7 వ తేదీన ఆర్ఆర్ఆర్, జనవరి 14 వ తేదీన రాథేశ్యామ్ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, దేశంలో కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ విధించారు. ముంబైలో ఉదయం సమయంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మమారాష్ట్రతో పాటుగా గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలులో ఉన్నాయి.
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నా చిన్నహోప్‌తో ఆర్ఆర్ఆర్, రాథేశ్యామ్ సినిమాలను ప్రమోట్ చేస్తున్నారు. జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇంటర్వ్యూలు ఇస్తున్నది. అంతేకాదు, కపిల్ విత్ నైట్స్, బిగ్‌బాస్ షోలలో కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. దక్షిణాది కంటే ఉత్తరాదినే ఎక్కువ ఫోకస్ చేసి ప్రమోట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీని సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించడంతో భారీగా ప్రమోట్ చేయాల్సి వస్తున్నది. ప్రమోషన్స్ వరకు బాగానే ఉన్నది. అసలు రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న. బాహుబలి తరువాత ప్రభాస్ జాతీయ స్థాయి నటుడు అయ్యాడు. ఆ స్థాయిలోనే సినిమాలు తీస్తున్నారు. ప్రమోషన్ కూడా అదే రేంజ్‌లో ఉన్నది. ఎవైనా తేడాలు వస్తే ఈ రెండు సినిమాల ద్వారా ఇండస్ట్రీకి భారీ నష్టం వస్తుంది. ఒకవేళ నైట్ కర్ఫ్యూలు ఎత్తివేసినా ఎంత వరకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు అన్నది చూడాలి.
Advertisement