Home » పాముకాటుతో ఆస్పత్రిలో చేరిన సల్మాన్ ఖాన్…!

పాముకాటుతో ఆస్పత్రిలో చేరిన సల్మాన్ ఖాన్…!

by AJAY
Ad

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురయ్యారు. సల్మాన్ ఖాన్ ను శుక్రవారం రాత్రి మహారాష్ట్రలోని పన్వేల్ లోని తన ఫాంహౌస్ లో పాము కుట్టింది. దాంతో సల్మాన్ ఖాన్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే సల్మాన్ కు ఎలాంటి ప్రమాదం లేదని ఆయనను కుట్టిన పాముకు విషం లేదని వైద్యులు నిర్ధారించారు. దాంతో సల్మాన్ పై ఎలాంటి ప్రభావం చూపదని తెలిపారు. కానీ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే డాక్టర్లు చెప్పడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

salman khan

salman khan

ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఇటీవల ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్స్ లో భాగంగా బజరంగీ బైజాన్ పార్ట్ 2 సినిమాలో కూడా నటించాలని ఉందని తెలిపారు. భజరంగీ భాయిజాన్ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ కావాలని సల్మాన్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ను ఇండైరెక్టుగా అడిగినట్టు కనిపించింది. మరోవైపు బిగ్ బాస్ షో కు వ్యాఖ్యాతగా చేస్తూ సల్లు భాయ్ బిజీగా ఉన్నారు.

Advertisement

Visitors Are Also Reading