నయనతార సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు పూర్తి కావస్తోంది. ఇప్పటికి కూడా ఏమాత్రం తరగని అందంతో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఇండస్ట్రీలో హీరోలైతే దశాబ్దాల కాలాలపాటు కొనసాగుతారు కానీ హీరోయిన్ల సినీ కెరియర్ చాలా తక్కువగా ఉంటుంది. నయనతార 20 ఏళ్లుగా ఏ మాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో తనదైన గుర్తింపును సాధించింది నయనతార. అలాంటి ముద్దుగుమ్మ తెలుగు,తమిళ, కన్నడ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి ఎనలేని గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది.
also read:ఈ 3 నియమాలతో మీ తెల్ల జుట్టు మాయమవ్వడం పక్కా..!
Advertisement
అలాంటి ఈ అమ్మడు బాలీవుడ్ లో కూడా షారుక్ ఖాన్ సరసన జవాన్ మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇన్ని సినిమాలు చేసిన నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విజ్ఞేశ్ శివన్ ను 2022లో ప్రేమ వివాహం చేసుకుంది. అంతేకాదు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చింది. అలాంటి నయనతార పెళ్లి అయినప్పటి నుంచి కొన్ని వివాదాల బారిన పడింది. తాజాగా మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. ఇండస్ట్రీలోని పెద్దలు ఆమెను బ్యాన్ చేయాలని ఆలోచన చేస్తున్నారట . మరి పూర్తి వివరాలు చూద్దాం..
Advertisement
also read:అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. చివరికీ ఏమైందంటే..?
నయనతార దగ్గరికి ఎవరైనా కథ చెప్పడానికి వెళ్తే వాటిని ఓకే చెప్పి డైరెక్టర్ గా తన భర్తకే అవకాశాన్ని కల్పిస్తుందట. అంతేకాకుండా వేరే చిత్రాలను చేస్తున్న దర్శకులను కూడా తన పలుకుబడితో వారి సినిమాలు క్యాన్సల్ చేయించి తన భర్తకి అవకాశాలు వచ్చేలా చేస్తుందని సమాచారం. అయితే ఈ ఇష్యూపై సీరియస్ అయినా దిగ్గజ నిర్మాతలు డైరెక్టర్లు పద్ధతి మార్చుకోవాలని నయనతారకు వార్నింగ్ కూడా ఇచ్చారని, ఒకవేళ మారకుంటే ఇండస్ట్రీ నుంచి బాయ్ కట్ చేస్తామని గట్టిగా బదులిచ్చినట్టు సమాచారం.
also read: