ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా సినిమా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నది ఆర్ఆర్ఆర్ యూనిట్. ఈ సినిమాను ముంబైలో భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. ముంబైలో ప్రముఖ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు, కామెడీ షోలో చిట్ చాట్లు, సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోలో ఆర్ఆర్ఆర్ యూనిట్ సందడి చేసింది. అవకాశం ఉన్న ప్రతీ చోట ఆర్ఆర్ఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది.
ఇక ఇదిలా ఉంటే, ఈ ప్రమోషన్స్ కోసం ఎన్టీర్ ఓ షర్ట్ వేసుకున్నారు. అది పసుపు రంగులో ఉండటంతో దానిపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్నది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపురంగు షర్ట్‌పై మార్ఫింగ్‌తో తెలుగుదేశం పార్టీ గుర్తు వేసి సోషల్ మీడియాలో ప్రమోషన్ చేయడంతో ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చేస్తున్నప్రమోషన్స్ను ఇలా చేయడం తగదని, ఇలా చేయడం వలన ఎన్టీఆర్ ఇమేజ్‌కు విఘాతం కలుగుతుందని అన్నారు. ప్రమోషన్స్ కోసం బాహుబలి తరహాలో షర్ట్‌లపై ఆర్ అనే గుర్తును ముద్రించి వాటితో సెలబ్రిటీలు ప్రమోషన్స్ చేస్తున్నారు. సుమారు 400 కోట్ల రూపాయలతో ఈ మూవీ తెరకెక్కింది. స్వతంత్రకాలం నాటి కథకు కల్పితాన్నిజోడించి చిత్రాన్ని తీశారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినిమా ఎట్టకేలకు జనవరి 7 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.
Advertisement