Home » ఈ ఏడాది చ‌ర‌ణ్ దే…ఉపాస‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

ఈ ఏడాది చ‌ర‌ణ్ దే…ఉపాస‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

by AJAY
Ad

టాలీవుడ్ లోని ల‌వ్లీ క‌పుల్స్ లో రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల జంట కూడా ఒక‌టి. మెగా త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తాను ప్రేమించిన చిన్న‌నాటి స్నేహితురాలు ఉపాస‌న కొనిదెల‌ను వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లి త‌ర‌వాత ఇద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. చాలా మంది సెల‌బ్రెటీల జీవితాల గురించి ర‌క‌ర‌కాల వార్త‌లు వినిపిస్తుంటాయి కానీ చ‌ర‌ణ్ ఉపాస‌న‌ల పై ఎలాంటి వార్త‌లు వినిపించ‌వు.

Advertisement

కాబ‌ట్టి ఇద్దరి మ‌ధ్య బాండింగ్ ఎంత ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ ను ఎంత‌గానోగా ఎంక‌రేజ్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా మ‌రోవైపు త‌న వ్యాపారాల‌ను సైతం చూసుకుంటూ ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ సినిమాల్లో బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఉపాస‌న‌కు స‌మ‌యాన్ని కేటాయిస్తూ ఉంటాడు. ఇక ఇటీవ‌లే తాను ప్రెగ్నెంట్ అన్న విష‌యాన్ని ఉపాస‌న వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

కాగా తాజాగా ఉపాస‌న చ‌ర‌ణ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది. రామ్ చ‌ర‌ణ్ నాటునాటు పాట అవార్డు కోసం ఉక్రెయిన్ వెళ్లిన‌ప్పుడు. సినిమా షూటింగ్ ల‌లో ఉన్న‌ప్పుడు మ‌రియు ఇంట్లో ఉన్న‌ప్పుడు ఇలా ప్ర‌తి విష‌యంలోనూ చ‌ర‌ణ్ వెంట‌నే ఉన్నాన‌ని చెప్పారు.

చ‌ర‌ణ్ కు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని ఇచ్చింద‌ని చెప్పారు. వ‌ర్క్ ప‌రంగా కూడా చ‌ర‌ణ్ ఆనందంగా ఉన్నార‌ని ఈ సంవ‌త్స‌రం ఎన్నో ప్ర‌శంస‌లు అందుకున్నార‌ని తెలిపారు. ఇక ఆస్కార్ వేడుక‌ల కోసం ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ క‌లిసి వెళ్లారు. ప్ర‌స్తుతం వారి ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ALSO READ :మెగాస్టార్ త‌మ్ముడు నాగబాబు ఇండ‌స్ట్రీలో ఎందుకు స‌క్సెస్ అవ్వ‌లేదు…కారణం అదేనా.?

Visitors Are Also Reading