తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్లలో శ్రీదేవి అంటే తెలియని వారు ఉండరు. ఆమె తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అలాంటి శ్రీదేవి ఒక సినిమా చేయడం కోసం చిరంజీవినే అవమానించిందట..
Advertisement
మరి ఆ విశేషాలు ఏంటో చూద్దాం.. చిరంజీవి కెరియర్ లో నెగిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయిన సినిమాల్లో కొండవీటి దొంగ సినిమా ఒకటి. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా నటించగా కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత దారుణమైన నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
చిరు కెరియర్ లోనే లంకేశ్వరుడు మూవీ కంటే పెద్ద ఫ్లాప్ అంటూ కామెంట్స్ వినిపించాయి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో కలెక్షన్ల వర్షం కురిసింది. మెగాస్టార్ కెరియర్ లో అత్యధిక వసూలు చేసిన సినిమాల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిజానికి ఈ సినిమాలో మొదట శ్రీదేవి హీరోయిన్ అనుకున్నారట. కానీ చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ దృష్టిలో పెట్టుకొని కథ కూడా రాశారు. మొదట ఈ కథను చిరంజీవి కి వినిపించగా ఆయన ఓకే చెప్పారు. ఆ తర్వాత కోదండరామిరెడ్డి శ్రీదేవికి కథ వినిపించారు.
Advertisement
కాగా శ్రీదేవి కథలో మార్పులు చేయాలని చెప్పారట. పూర్తిగా సినిమా టైటిల్ నే మార్చాలని కొండవీటి దొంగ ప్లేస్ లో కొండవీటి రాణి అని పెట్టాలని చెప్పారట. అంతేకాకుండా టైటిల్ కార్డులో హీరో పక్కనే తన పేరు కూడా వేయాలని డిమాండ్ చేసారట. చిరంజీవి కంటే ఎక్కువగా నాకు ఈ చిత్రంలో ప్రిఫరెన్స్ ఉండాలని చెప్పుకొచ్చారట. దీంతో చిత్ర యూనిట్ చేసేదేమీ లేక శ్రీదేవి స్థానంలో రాధాని హీరోయిన్గా తీసుకున్నారు. కొండవీటి దొంగ టైటిల్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ విధంగా శ్రీదేవి చిరంజీవిని అవమానించిందని అప్పట్లో టాక్ వినిపించింది.
also read: