తమకు నచ్చింది మాట్లాడుతూ…నచ్చినట్టు బ్రతికే సెలబ్రెటీలలో కస్తూరి కూడా ఒకరు. కస్తూరి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ అన్నమయ్య హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు. అన్నమయ్యతో పాటూ భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో కూడా కస్తూరి హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ప్రస్తుతం సీరియల్స్ లో నటిస్తోంది. తెలుగులో కస్తూరి నటిస్తున్న గృహలక్ష్మి సీరియల్ కు ఎంతో ప్రేక్షకాదణ లభిస్తోంది.
Advertisement
ఇదిలా ఉంటే కస్తూరి తరచూ ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ పై గతంలో చేసిన కామెంట్ ల గురించి మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కింది. కొద్ది రోజు క్రితం అనసూయను ఆంటీ అని పిలుస్తూ కొంతమంది ట్రోల్ చేశారు. దాంతో అనసూయ ఫైర్ అయ్యింది.
Advertisement
కాగా తాజాగా ఆ వివాదం పై కస్తూరి స్పందించింది. చిన్నపిల్ల వచ్చి ఆంటీ అని పిలవడానికి దున్నపోతులా ఉన్నవాళ్లు వచ్చి ఆంటీ అని పిలవడానికి చాలాతేడా ఉంది. ఆంటీ అని పిలవడం కరెక్ట్ కాదు…చిన్నపిల్లలు మాత్రమే ఆంటి అని పిలవడం కరెక్ట్…. ఓ హీరోని అంకుల్ అని పిలుస్తారా..? అనసూయ కంటే రెట్టింపు ఏజ్ ఉన్న హీరోలను అంకుల్ అని పిలిచి చూడండి. అలా అనరు కదా….ఇప్పటికే ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. మనసులో చెడు ఆలోచనలు ఉంటేనో లేదా గౌరవం లేకపోతేనో ఆంటీ అని పిలుస్తారు. ఈ విషయంలో నేను అనసూయకు సపోర్ట్ ఇస్తాను. అంటూ కస్తూరి కామెంట్ లు చేసింది.