ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఏమాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గలేదు. ఐపీఎల్ ప్రారంభమైతే చాలు అందరూ… ఆ మ్యాచ్లను చూసేందుకే ఆసక్తి చూపిస్తారు. ఇక 2023 ఐపీఎల్ సీజన్ మరో నెల రోజుల్లోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రుతలూగించేందుకు సిద్ధమవుతోంది. ఈ తరుణం లోనే ఐపీఎల్ లో పెద్ద స్టార్లుగా ఎదిగే టాప్-5 యంగ్ ప్లేయర్స్ ను సెలెక్ట్ చేశాడు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ.
Advertisement
Advertisement
ఈ యువ ఆటగాళ్లలో మొదటి స్థానానికి పృద్విషాని ఎంపిక చేసుకోగా, ఆ తర్వాత రెండు, మూడు స్థానాలకు రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ లను తీసుకున్నాడు. మిగతా ఇద్దరిలో టీమిండియా స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ శుబ్ మన్ గిల్ లు ఉన్నారు. ఈ ఐదుగురే ఐపీఎల్ లో టాప్ ఫైవ్ యంగ్ ప్లేయర్స్ అని సౌరవ్ తెలిపాడు. ఈసారి ఐపీఎల్ ఆడినప్పటికీ అతడిని ఎంపిక చేశాడు దాదా. ఈ లిస్టులో శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను చోటు కల్పించలేదు గంగూలి.
ఇక సూర్య కుమార్ కు 30 సంవత్సరాలు దాటడంతో, అతడిని స్పెషల్ కేటగిరీలో తీసుకున్నాడు. వీరందరూ ఎలాంటి ఆటగాళ్ళో మీకు తెలిసిన విషయమే అని గంగూలి పేర్కొన్నాడు. ఇక ఈ షోలో గంగూలితో పాటుగా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ కూడా పాల్గొన్నారు. యంగ్ ప్లేయర్ గిల్ గురించి బజ్జి అడగ్గానే అతడిని ఈ జాబితాలో చేర్చాడు గంగూలి. సరిగ్గా ఐదో ఆటగాడిగా గిల్ పేరు నా మనసులో మెదిలింది అని అన్నాడు బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ.