నందమూరి తారకరత్న 39 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఆకస్మాత్తుగా కన్నుమూయడం నిజంగా బాధాకరం. లోకేష్ పాదయాత్రలో పాల్గొనడం కోసం తారకరత్న జనవరి 27న కుప్పం వచ్చారు. ఒక మసీదులో ప్రార్థనలు నిర్వహించి బయటకు వస్తుండగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కానీ ఆసుపత్రికి తీసుకెళ్లిన బతకలేకపోయారు. అయితే నందమూరి తారకరత్న మరణించినప్పటి నుంచి ఆయనకు సంబంధించిన అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
Advertisement
కాగా సినిమాల్లో పెద్దగా రాణించని తారకరత్నకు బిజినెస్ లు ఉన్నట్లు టాక్. అయితే ఆయనకు సంబంధించిన హోటల్ ను గతంలో కూల్చివేశారు అనే విషయం ప్రస్తుతం బయటకు వచ్చింది. నందమూరి తారకరత్న హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కబరా డ్రైవ్ ఇన్ పేరుతో ఒక రెస్టారెంట్ ఉండేది. ఆ రెస్టారెంట్ 2019లో జిహెచ్ఎంసి అధికారులు కూల్చేందుకు సిద్ధమయ్యారు. సిబ్బంది అడ్డుకున్నప్పటికీ కొంత భాగం కూల్చేసారట. ఈ విషయం తెలుసుకున్న తారకరత్న వెళ్లి సమస్య ఏంటని ప్రశ్నించారు.
Advertisement
నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో కమర్షియల్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారట. అంతే కాకుండా రెస్టారెంట్ లో లిక్కర్ కూడా సప్లై చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని కొందరు కంప్లైంట్ చేసినట్లు జిహెచ్ఎంసి అధికారులు వెల్లడించారని సమాచారం. అలా సడన్ గా రెస్టారెంట్లను కూల్చివేతకు అధికారులు సిద్ధం కావడంతో అక్కడి ఫర్నిచర్, మెటీరియల్ ను షిఫ్ట్ చేసేందుకు వారితో చర్చించి తారకరత్న కొంత సమయం తీసుకున్నారట. తర్వాత ఆ రెస్టారెంట్ ను వేరొక చోటుకు మార్చారట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
read also : తారకత్న భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు కీలక పదవి?