నందమూరి ఫ్యామిలీలో ప్రస్తుతం మూడవ తరం హీరోల్లో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇద్దరు హీరోలు ఒక తల్లికి పుట్టక పోయిన ఒకే తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన తారక రత్నను చివరి చూపు చూడ్డానికి కూడా అన్నదమ్ములు కలిసే వెళ్లారు. ఇక వీరి మధ్య ఉన్న అనుబంధం మనందరికీ తెలుసు. అయితే గతంలో జూనియర్ ఎన్టీఆర్ ని నందమూరి ఫ్యామిలీ చాలా దూరంగా ఉంచింది. ఆ టైంలో కళ్యాణ్‌రామ్ కూడా దగ్గరికి తీయలేదు.
Advertisement
కానీ ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నిలదొక్కుకున్నారో నందమూరి ఫ్యామిలీ అంతా దగ్గరికి వచ్చింది. ఈ హరికృష్ణ చనిపోయాక కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిపోయింది. అయితే గతంలో కళ్యాణ్‌రామ్ కొన్ని సినిమాల వల్ల చాలా అప్పుల్లో కూరుకుపోయారు. అంతేకాకుండా ఆయన నటించిన ఓం సినిమా అట్టర్ ప్లాప్ అవడం అలాగే ఆయన నిర్మాత వ్యవహరించిన kick2 సినిమా భారీ ఫ్లాప్ తెచ్చి పెట్టడం వల్ల కళ్యాణ్ రామ్ చాలా అప్పుల్లో కురుకు పోయారట. ఈ టైంలో జూనియర్ ఎన్టీఆర్ తన అన్న ఇండస్ట్రీలో మళ్ళీ రాణించాలనే ఉద్దేశంతో 12 కోట్ల రూపాయలు ఇచ్చారట.
Advertisement
అంతేకాకుండా మళ్ళీ ఇండస్ట్రీలో పుంజుకోవడం కోసం జై లవకుశ అనే సినిమాని తన అన్న నిర్మాణ సారథ్యంలో చేసి కళ్యాణ్ రామ్ కి బ్లాక్ బాస్టర్ హిట్ ని అందించారు. ఈ మూవీ వల్ల కళ్యాణ్ రామ్ అప్పులన్నీ తీరిపోయాయి అంట. ఇక మరి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ పారితోష్కం కూడా తీసుకోకపోవడం గమనార్హం. ఇలా కళ్యాణ్ రామ్ కి ఎల్లవేళలా జూనియర్ ఎన్టీఆర్ తోడుంటూ చాలా అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ ఇవ్వకపోతే కళ్యాణ్ రామ్ ఇప్పుడు ఏమై ఉండేవారో అంటూ చాలామంది కామెంట్ పెడుతున్నారు..
also read: