యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తెలియని వారు ఉండరు. బాహుబలి మూవీ ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఇక అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలే చేస్తూ ముందుకు పోతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో వేలాది కోట్ల రూపాయల బడ్జెట్ తో కూడుకున్న చిత్రాలు ఉన్నాయి. దర్శక నిర్మాతలకు ఎంత నమ్మకం ఉంటే ఇంత బడ్జెట్ పెట్టి ఆయనతో సినిమాలు చేస్తారో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
అంతేకాకుండా ఈమధ్య కాలంలో నటించిన సాహూ, రాధే శ్యామ్ రెండు పాన్ ఇండియా సినిమాలు ఫ్లాప్ అయినా కానీ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదంతా పక్కన పెడితే తాజాగా ప్రభాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.. ప్రభాస్ 40 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆ వ్యక్తి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరో పూర్తి వివరాలు చూద్దాం. ప్రభాస్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ గోపీచంద్ లాంటి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారట. ఆయన పేరే రవి..
Advertisement
రవి అంటే ప్రభాస్‌కు చాలా ఇష్టమట. ఎంత రాత్రి అయినా సరే రవితో మాట్లాడకుండా ఉండేవారు కాదట. అయితే గతంలో రవి ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆమె చేతిలో మోసపోయి చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారట. అయితే ఈ ప్రభాస్ దగ్గర ఎప్పుడూ కూడా ఆ అమ్మాయి గురించి ప్రస్తావిస్తూ ఉండేవారట. దీంతో ప్రభాస్ కు ప్రేమ అన్న పెళ్లి అన్న ఇష్టం లేకుండా పోయింది. ఈ కారణంగానే ప్రభాస్ ఇన్ని రోజులు పెళ్లి చేసుకోవడానికి దూరంగా ఉంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
also read: