Home » పెళ్లికి ముందే ఆస్తి పంప‌కాలు…అస‌లు నిజాలు బ‌య‌ట‌పెట్టిన తార‌క‌ర‌త్న సన్నిహితుడు..!

పెళ్లికి ముందే ఆస్తి పంప‌కాలు…అస‌లు నిజాలు బ‌య‌ట‌పెట్టిన తార‌క‌ర‌త్న సన్నిహితుడు..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో నంద‌మూరి తార‌క‌ర‌త్న ఇటీవ‌లే గుండెపోటుతో మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. తార‌క‌ర‌త్న కేవ‌లం 40 ఏళ్లవ‌య‌సులోనే ఈ లోకాన్ని వ‌దిలి వెళ్లడం అటు కుటుంబంలో ఇటు అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అంతే కాకుండా తార‌క‌ర‌త్న కొంత‌కాలంగా టీడీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పార్టీలో ప‌నిచేస్తూ రాబోయే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా సైతం పోటీ చేయాల‌ని భావించిన‌ట్టు తెలుస్తోంది.

tarakaratna-assest

Advertisement

కానీ ఇంత‌లోనే తార‌క‌ర‌త్న క‌న్నుమూయ‌డంతో అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. కాగా తార‌క‌ర‌త్న కు సంబంధించిన ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. తార‌క‌ర‌త్న ఆర్థికఇబ్బందులు ఎదురుకున్నార‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ తార‌క‌ర‌త్న‌కు నెల‌కు నాలుగు ల‌క్ష‌లు పంపార‌ని ఇలా అనేకర‌కాల వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

కాగా తాజాగా తార‌క‌ర‌త్న స‌న్నిహితులు నిర్మాత ప్ర‌స‌న్న‌కుమార్ ఆ వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చారు. తార‌క‌ర‌త్న ఆర్థిక‌ప‌రిస్థితి బాగాలేద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. చనిపోయేవర‌కూ తార‌క‌ర‌త్న సినిమాలు చేస్తున్నార‌ని రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్నార‌ని చెప్పారు. తార‌క‌ర‌త్న‌కు ల‌గ్జ‌రీ కార్ లు తీసుకోవాల‌నే కోరిక ఉండేది త‌ప్పితే ఆయ‌న ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌లేద‌ని చెప్పారు.

అంతే కాకుండా తార‌క‌ర‌త్న కుటుంబ స‌భ్యులు ఆయ‌న పెళ్లి త‌ర‌వాత ఎంత ఇవ్వాలో లెక్క ప్ర‌కారం అన్నీ ఇచ్చేశార‌ని అన్నారు. కాగా ఇప్పటి నుండి తార‌క‌ర‌త్న సినిమా జీవితం మ‌రియు పొలిటిక‌ల్ లైఫ్ ట‌ర్న్ అవుతుంద‌ని అనుకున్నామ‌ని కానీ ఇంత‌లోనే ఇలా జ‌రిగిపోయింద‌ని ప్ర‌స‌న్న‌కుమార్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ALSO READ :తారకత్న భార్య అలేఖ్య రెడ్డికి చంద్రబాబు కీలక పదవి?

Visitors Are Also Reading