Home » ఖర్చు ఎక్కువైందని భార్యను వదిలేసిన NRI భర్త

ఖర్చు ఎక్కువైందని భార్యను వదిలేసిన NRI భర్త

by Bunty
Ad

కట్టుకున్న భార్య చదువుకు ఖర్చులను భరించలేనని ఎన్నారై భర్త ఆమెను వదిలేసాడు. అమ్మాయి తల్లిదండ్రులు ఎన్నిసార్లు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోవడంతో గచ్చిబౌలి మహిళా పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, హైదరాబాదులోని మాదాపూర్ కు చెందిన ఓ యువతీ స్థానికంగా డిగ్రీ పూర్తిచేసింది. ఆమె తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోల ద్వారా అమెరికాలో స్థిరపడిన వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేశారు.

Advertisement

యుఎస్ లోని వర్జినియాలో ఉద్యోగి కావడంతో పెళ్లి అయిన కొద్ది రోజులకు తన భార్యను తీసుకొని వెళ్ళిపోయాడు. వీరికి కాపురం ఐదేళ్లపాటు సజావుగా సాగింది. అయితే, ఆర్థికంగా భర్తకు చేదోడుగా ఉండేందుకు యువతి నిర్ణయించుకొని తన చదువును కొనసాగించేందుకు సిద్ధమైంది. దీంతో అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్ లో చేరింది. అయితే, కొన్నాళ్ల తర్వాత భార్య చదువుకు ఖర్చు ఎక్కువ అవుతుందని ఎన్నారై భర్త ఆమెను వదిలించేందుకు సిద్ధమయ్యారు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూవచ్చాయి.

Advertisement

ఈ విషయాన్ని యువతి ఇండియాలోని తల్లిదండ్రులకు తెలిపింది. పలుమార్లు యువతి తల్లిదండ్రులు అల్లుడితో మాట్లాడిన ఫలితం కనిపించలేదు. ఇండియాలో అల్లుడి తల్లిదండ్రులను సంప్రదించినప్పటికీ ఫలితం లేకపోవడంతో, యువతి తల్లిదండ్రులు గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విదేశాల్లో తన కూతురు ఒంటరి అయిపోయిందని యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

READ ALSO : మీ భర్త మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఈ చిట్కాలతో తెలుసుకోండి..!

 

Visitors Are Also Reading