నారా లోకేష్ మొదలుపెట్టిన యువగలం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని చివరికి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ తుది శ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, సినీ పరిశ్రమ వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ తరుణంలోనే తారకరత్న బాబాయ్ ఒకప్పటి నందమూరి హీరో నందమూరి కళ్యాణ చక్రవర్తి కూడా వచ్చారు.
Advertisement
స్వర్గీయ ఎన్టీఆర్ తమ్ముడు నందమూరి త్రివిక్రమరావు కొడుకే ఈయన. 1986 నుండి 1994 వరకు హీరోగా సినిమాలు చేశారు. అత్తగారు స్వాగతం, అత్తగారు జిందాబాద్, మామ కోడళ్ల సవాల్, ఇంటిదొంగ, అక్షింతలు, కృష్ణ లీల, రౌడీ బాబాయ్, దొంగ కాపురం, లంకేశ్వరుడు, తలంబ్రాలు, ప్రేమ కిరీటం, జీవనగంగా వంటి పలు చిత్రాల్లో నటించారు. కేవలం కథానాయకుడిగానే కాకుండా కీలక పాత్రల్లోనూ కనిపించారు.
Advertisement
ముఖ్యంగా కళ్యాణ చక్రవర్తిని మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించి ఆ తరహా కథలతో చిత్రాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. మంచి హైట్, పర్సనాలిటీ, హీరోగా నిలదొక్కుకునే అవకాశం ఉన్న కానీ సరైన సినిమా పడకపోవడం, నందమూరి కుటుంబం సపోర్టు ఉన్నా కానీ కెరియర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయారాయన. బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ చెన్నైలోనే స్థిరపడిపోయారు కల్యాణ చక్రవర్తి.
READ ALSO : SRH : సన్ రైజర్స్ హైదరాబాద్ కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు