Home » Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈ సారి ఏం జరిగిందంటే..!

Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈ సారి ఏం జరిగిందంటే..!

by Bunty
Ad

జానపద పాటలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది సింగర్ మంగ్లీ మాత్రమే. తను ఏ పాట పాడిన తప్పనిసరిగా సెన్సేషనల్ హిట్ అవుతుంది. ఆమె గొంతులో ఏముందో ఏమో కానీ ఆమె పాట వింటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి మంగ్లీ మామూలు న్యూస్ ఛానల్ యాంకర్ గా కెరియర్ ను స్టార్ట్ చేసి, ఎన్నో ఆపసోపాలు పడి జానపద పాటలు పాడుకుంటూ గాయకురాలిగా మారింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సింగర్ లలో మంగ్లీ కూడా ఒక స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది.

Advertisement


ఇది ఇలా ఉండగా మంగ్లీ మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా మరోసారి మంగ్లీ పాడిన ఓ పాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో భం…భం.. బోలే అనే సాంగ్ చిత్రీకరించారు. ఈ పాటకు సంబంధించిన వీడియోను మంగ్లీ… శివరాత్రి స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయడంతో వివాదం మొదలైంది. దాదాపు రెండు దశాబ్దాలకు ఆలయంలోపల వీడియోలు మరియు ఫోటోలు తీసేందుకు అనుమతి లేదు. అలాంటిది గర్భగుడిలో మంగ్లీ అండ్ టీం షూటింగ్ ఎలా చేస్తారంటూ కొందరు పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వీరికి పర్మిషన్ ఎలా ఇచ్చారు అంటూ నిలదీస్తున్నారు. ఎవరికి తెలియకుండా తెల్లవారుజామున గర్భగుడిలో ఈ పాట నుంచి చిత్రీకరణ జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

READ ALSO : చరణ్ సంచలన వ్యాఖ్యలు…మౌనం వీడితే తట్టుకోలేరని రోజాకు స్ట్రాంగ్ వార్నింగ్!

Visitors Are Also Reading