నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఈనెల 18న శివరాత్రి పండుగ రోజున తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న అకస్మాత్తుగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే చిత్తూరులోని ఆసుపత్రికి తరలించారు.
Advertisement
మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో విదేశీ వైద్యుల సమక్షంలో దాదాపు ఈయనకు 23 రోజుల పాటు చికిత్స జరిగినప్పటికీ ఆరోగ్యంతో తిరిగిరాలేక మృత్యువు ఒడిలో చేరారు. అయితే, నిన్న సాయంత్రం తాకలను అంతక్రియలు జరిగాయన్న సంగతి తెలిసిందే. అయితే, తారకరత్న అంత్యక్రియలకు కొన్ని గంటల ముందు మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఫిలిం ఛాంబర్ లో హల్చల్ చేశాడు. ఆ వ్యక్తి బాలయ్య దగ్గరకు వెళ్ళి… వేలెత్తి చూపుతో మాట్లాడాడు. బాలయ్య కూడా అతను చెప్పింది విని.. తలుపారు.
Advertisement
అయితే ఆ వ్యక్తి ఎవరని ఆరా తీయగా, కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వ్యక్తి ఫిలింనగర్ లో నివసిస్తున్నాడని సమాచారం అందుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడితే ఫిలింనగర్ చుట్టుపక్కల ఆ వ్యక్తి తిరుగుతాడని, అయితే అక్కడి ప్రజలు ఆ వ్యక్తి మాటలు లెక్క చేయాలని తెలుస్తోంది. అయితే మరి కొందరు మాత్రం బాలయ్యను దేవుడు ఏదో ఒక విషయంలో ఈ విధంగా హెచ్చరించాడని చెబుతున్నారు. ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేస్తే మంచిదని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజెన్లు.
read also : ‘రామ బాణం’ తరహాలో పాత మూవీ టైటిల్స్‌తో వచ్చిన తెలుగు మూవీస్..