సాధారణంగా పెళ్లి చేసుకోవాలంటే ఆటేడు తరాలు ఈటేడు తరాలు చూసుకొని చేసుకోవాలని సామెత ఉంది. కానీ ప్రస్తుత కాలంలో అలాంటివి పాటించడం లేదు. దీంతో చాలామంది భార్య భర్తలు పెళ్లిళ్లు చేసుకొని ఒకరినొకరు అర్థం చేసుకోలేక మధ్యలోనే పెళ్లి పెటాకులు చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాదులోని ఓ పెళ్లిలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఊహించని పరిణామంతో వధువు ఇంట్లో కలకలం రేగింది.
Advertisement
కారణం పెళ్లికి రావాల్సిన పెళ్లికొడుకు రాలేదు. ఈ ఘటన హైదరాబాదులోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాదులోని మౌలాలికి చెందిన జకారియా అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయింది. ఆదివారం (ఫిబ్రవరి 19)వివాహం జరిపించాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. అయితే చివరి నిమిషంలో వరుడు పెళ్లి వేదిక దగ్గరకు రాలేదు.
Advertisement
ఆరాతీయగా కట్న కానుకల విషయంలో పాతమంచం ఇచ్చారన్న కోపంతో ముఖం చాటేసాడు. తనకు పాత మంచం ఇచ్చారు కాబట్టి ఈ పెళ్లి చేసుకోను అని చివరి నిమిషంలో వధువు కుటుంబ సభ్యులకు ఊహించని షాక్ ఇచ్చాడు. వధువు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
READ ALSO : తారకరత్న మరణ వార్తను…చంద్రబాబు ఇన్నాళ్లు దాచారు – లక్ష్మీపార్వతి