నందమూరి తారకరామారావు మనుమడు నందమూరి తారకరత్న మృతి చెందారు. గత 23 రోజులుగా ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నందమూరి తారకరత్న శివరాత్రి రోజున మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న రాత్రి సమయంలో నారాయణ హృదయాలయ వైద్యుల అధికారులు ప్రకటించారు. తారకరత్న మరణ వార్తను ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదే అంటూ బాలకృష్ణ మాటిచ్చారని వైసీపీ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వాక్యాలు చేశారు.
Advertisement
*బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని తెలిపారు.తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదే అంటూ బాలకృష్ణ మాటఇచ్చారని తెలిపారు. 9:03 నిమిషాలకు ఇక్కడి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలిస్తాము. ఉదయం 10 గంటలకు ఫిల్మ్ చాంబర్ కు చేరుకుంటుందన్నారు.
Advertisement
మూడు గంటలకు పైగా ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం అంత్యక్రియలు మహాప్రస్థానంలో ఉంటాయని పేర్కొన్నారు. అలేఖ్య మానసికంగా సిక్ అయిందని, తారకరత్నను అలేఖ్య అత్యంత ఎక్కువగా ప్రేమించిందన్నారు.ఆమెకు కాళ్లు, చేతులు నొప్పులు వస్తున్నాయి. తారకరత్న మరణం కుటుంబ సభ్యులను, అభిమానులను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. 39 ఏళ్లకే మరణించడం చాలా బాధాకరం. తారకరత్న రాజకీయాల్లోకి ప్రవేశించాలని అనుకున్నప్పుడు చనిపోవడం చాలా దురదృష్టకరం అన్నారు.
Read Also: నందమూరి తారకరత్న అరుదైన చిత్రాలు