Home » “ఎన్టీఆర్” నుండి “చిరంజీవి” వరకు…మహా శివుడి పాత్రలలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు!

“ఎన్టీఆర్” నుండి “చిరంజీవి” వరకు…మహా శివుడి పాత్రలలో మెప్పించిన టాలీవుడ్ హీరోలు!

by Bunty
Ad

మహాశివరాత్రి పర్వదినం. శివరాత్రిని మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున ప్రతి ఏడాది జరుపుతారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహా శివరాత్రి ముందు గ్రహాలు తమ రాశి చక్రాలు మార్చుకున్నప్పుడు అది చాలా ముఖ్యమైనదిగా చెప్పబడుతుంది. అయితే, మహాశివడైన ఆ దేవునిపై తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి. చాలా మట్టుకు మన ఆగ్ర హీరోలు మన దేవుని వేషం వేసి మెప్పించారు. అలా తెలుగు తెరపై శివుడిగా మెప్పించిన హీరోలు ఎవరు ఉన్నారో చూద్దాం.

Advertisement

# ఎన్టీఆర్

ఎన్టీఆర్ అంటే ముఖ్యంగా రాముడు, కృష్ణుడు వేషాలు గుర్తుకొస్తాయి. కానీ ఈయన దక్షయజ్ఞం, ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమాల్లో శివుడి వేషంలో మెప్పించడం విశేషం.

# ఏఎన్ఆర్

అక్కినేని నాగేశ్వరరావు శివుడిగా పౌరాణిక సినిమా చేయకపోయినా, ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన మూగమనసులు సినిమాలోని గౌరమ్మని మొగుడెవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించి మెప్పించారు.

# శోభన్ బాబు

నటభూషణ శోభన్ బాబు కూడా ఎన్టీఆర్ హీరోగా నటించిన పరమానందయ్య శిష్యుల కథ సినిమాలో శివుడి పాత్రలో నటించి మెప్పించారు.

# కృష్ణంరాజు

వినాయక విజయం సినిమాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పరమశివుని వేషంలో మెప్పించారు. ఈ సినిమా ఎప్పుడు వినాయక చవితి వస్తే, ఈ సినిమాను శాటిలైట్ ఛానల్ లో ప్రదర్శిస్తూ ఉంటారు.

Advertisement

# చిరంజీవి

కె.రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీ మంజునాథలో చిరంజీవి పరమశివుడిని వేషంలో మెప్పించారు. అంతకుముందు చిరంజీవి ఆపద్బాంధవుడు, పార్వతి పరమేశ్వరులు అనే సినిమాలో శివుడిగా కాసేపు మెరిసారు.

# బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ, జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామ కళ్యాణం సినిమాలో ఎంత నేర్చిన ఎంత చూసిన అనే పాటలో శివుడిగా కాసేపు కనిపించారు. కానీ పూర్తిస్థాయిలో ఈ మహా శివుడి పాత్రలో నటించకపోవడం విశేషం.

# నాగార్జున

నాగార్జున అక్కినేని కూడా భారవి దర్శకత్వంలో తెరకెక్కిన జగద్గురు ఆదిశంకర చిత్రంలో నాగార్జున శివుని పాత్రలో చండాలుడు పాత్రలో కాసేపు కనిపించారు. ఈయన కూడా పూర్తిస్థాయిలో నటించకపోవడం విశేషం.

# సుమన్

సుమన్ కూడా శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమాలో సత్యనారాయణ స్వామితో పాటు శివుడిగా, బ్రహ్మగా నటించారు. త్రిమూర్తులైన పరమాత్మ రూపం ఒకటే అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. అందుకే చిత్రంలో త్రిమూర్తులుగా సుమన్ వేషం వేయడం విశేషం.

READ ALSO :  23 రోజులు విశ్వ ప్రయత్నాలు చేసినా… తారకరత్నను బ్రతికించలేక పోవడానికి కారణం ఇదే?

Visitors Are Also Reading