నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లో రాణించారు. సినిమా హీరోగా ఎన్టీఆర్ జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, ప్రతి పౌరాణిక పాత్రకు సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్.
Advertisement
అయితే దర్శకరత్న దాసరి నారాయణరావు, దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావు ఈ ఇద్దరు దర్శకుల విషయంలో అన్న గారు ఎన్టీఆర్ కు మరో ప్రత్యేక స్థానం ఉంది.
అదేంటంటే, ఎన్టీఆర్ వయసు 55 ఏళ్లు దాటిపోయింది. దీంతో ఆయనను హీరోగా తీసుకునేందుకు నిర్మాతలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫిజిక్ చూస్తే, ఆయన పెద్దగా ఇప్పటిలాగా సిక్స్ ప్యాక్ కోసం ఎలాంటి కసరత్తులు చేయలేదు. ప్రత్యేకంగా ట్రైలర్ ను కూడా నియమించుకోలేదు. పైగా ఆహార నియమాలు కూడా పాటించేవారు కాదు. తనకు నచ్చిన ఆహారాన్ని సృష్టిగా భోంచేసేవారు.
Advertisement
దీంతో ఎన్టీఆర్ కు ఆ వయసులో పొట్ట కనిపించేది. అయితే అప్పటికే తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి కూడా అంతోఇంతో మారుతుంది. అయినప్పటికీ ఎన్టీఆర్ అంటే అభిమానమే. ఇలాంటి సమయంలో అన్నగారిని డిఫరెంట్ రోల్ లో చూపించేందుకు దాసరి, రాఘవేంద్రరావులు ప్రయత్నించారు. వీరికి ఆయనతో చేయాలన్న అభిలాష, మరోవైపు, అన్న గారికి తనను తాను మరోసారి నిరూపించుకోవాలనే భావన. దీంతో ఈ ఇద్దరు దర్శకులతో ఒక దశాబ్దం పాటు అనేక చిత్రాలు చేశారు.
ముఖ్యంగా హీరోయిన్ వయసు 20-24 ఏళ్లలోపు ఉంటే, అన్నగారి వయసు 55 ఏళ్లు ఉండేది. అయినప్పటికి, కొన్ని క్లోజ్ షాట్లు, కొన్ని లాంగ్ షాట్లు తీయడంతో పాటు, విదేశాల నుంచి కాస్ట్యూమ్ డిజైనర్లను పిలిచి మరి అన్నగారికి ప్రత్యేకంగా దుస్తుల తయారు చేయించారు. దీంతో బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, అడవి రాముడు వంటి చిత్రాలు అన్నగారు నటించి మెప్పించారు. ఈ విషయాన్ని అన్నగారు అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు కూడా. దాసరి అంటే, ప్రత్యేక అభిమానం. ఇక, రాఘవేంద్రరావు మా వాడే అంటూ, అన్నగారు ప్రత్యేకంగా చెప్పేవారు.
read also : తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన బుజ్జి గుర్తుందా?