ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న హీరో జగపతి బాబు. ప్రస్తుతం జగపతిబాబు విలన్ గా మరియు ఇతర పాత్రలు చేస్తూ అదరగొడుతున్నారు. జగపతిబాబు ఒకప్పుడు వరుసగా ఏడు సినిమాలు ఫ్లాపైన మళ్లీ హీరోగా బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అంతే కాకుండా లెజెండ్ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
Advertisement
అయితే ఆయన పెద్ద కూతురు అమెరికాన్ ని ప్రేమిస్తే మరో మాట అడక్కుండా దగ్గరుండి పెళ్లి చేశారు. పెద్ద కుమార్తె పిల్లల్ని వద్దు అనుకుంటున్నాను అని చెబితే ఆమె నిర్ణయాన్ని స్వాగతించినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జగపతిబాబు తెలిపారు. తాను ఇప్పుడు పెట్స్ పెంచుకుంటుందని, చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.చిన్న కూతురుకి అయితే తాను పెళ్లి చేయనని చెప్పేసారట జగ్గూ భాయ్. పిల్లలకు త్వరగా పెళ్లి చేయడం అనేది చేతులు దులిపేసుకుని స్వార్థమని చెప్పుకొచ్చారు. జగపతిబాబు పెళ్లి అనేది ఎవరికి వారు తీసుకోవాల్సిన నిర్ణయమన్నారు.
Advertisement
ప్రస్తుతం సమాజంలో విడాకులు కామన్ అయిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరుచేయడం కన్నా, కనకపోవడమే బెస్ట్ అంటూ మైండ్ హీటెక్కే కామెంట్ చేశారు. పిల్లలతో ఫ్రెండ్స్ లా ఉండాలి అని చెప్పిన ఆయన పెద్దయాక వాళ్ళు ఎలా బతకాలి అన్నది వాళ్లకే వదిలేయాలని చెబుతున్నారు. ఇద్దరు కుమార్తెలు అలాంటి నిర్ణయాలు తీసుకుంటే మీరు తాత అవ్వలేరు కదా అంటే, అయితే ఎంత, అవ్వకపోతే ఎంత తొక్క, అని సిల్లీగా కొట్టిపడేసారు. ఏదైనా బాబులో ఈ లెవెల్ మెచ్యూరిటీ చాలామందికి ఆశ్చర్యంగా అనిపించింది.