ప్రేమికుల రోజునే ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన తన ప్రియురాలిని ఓ దుర్మార్గుడు చంపేశాడు. అంతే కాకుండా అదే రోజున మరోయువతిని పెళ్లి చేసుకున్నాడు కూడా. ప్రియురాలిని హతమార్చి ఆ తరవాత ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే….ఢిల్లీలోని మిత్రోన్ గ్రామానికి చెందిన సామిల్ గెహ్లాట్ కొద్ది రోజుల క్రితం హర్యానాకు చెందిన నిక్కీయాదవ్ తో ప్రేమలో పడ్డాడు.
Advertisement
ఆ తరవాత వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. 2018లో ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.కాగా గత కొంతకాలంగా ఇంట్లో వారికి తెలియకుండా వీరిద్దరూ ఢిల్లీలో డేటింగ్ చేస్తున్నారు. నిక్కీ సామిల్ ను వివాహం చేసుకోవాలని నిర్నయించుకుంది. కానీ సామిల్ ఫ్యామిలీ అతడికి మరో సంబంధం చూశారు. అంతే కాకుండా సామిల్ కూడా నిక్కిని వదిలించుకోవాలని చూశాడు.
Advertisement
తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్నయించుకున్నాడు. నిక్కీ మరో యువతిని పెళ్లి చేసుకుంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించింది. తనతో గోవాకు రావాలని సామిల్ ను కోరింది. కానీ సామిల్ అందుకు నిరాకరించాడు. ఫిబ్రవరి 9 న సామిల్ నిశ్చితార్థం జరిగిపోయింది. ఆ తరవాత కూడా నిక్కీ తనను పెళ్లి చేసుకోవాలని నిక్కీ సామిల్ పై ఒత్తిడి తెచ్చింది.
దాంతో కోపోద్రేకుడైన అతడు నిక్కీని హతమార్చాడు. ఆమెను కారులో తీసుకువెళుతుండగా గొడవ జరగటంతో కారులోని చార్జింగ్ కేబుల్ ను మెడకు బిగించి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఓ దాబాలోని ఫ్రిజ్ లో పెట్టి తాళం వేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని జరిగిందంతా కక్కించారు. ఆ తరవాత కటకటాల్లోకి పంపించారు.