ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రానించినవాళ్లలో దివ్యవాణి కూడా ఒకరు. దివ్యవాణి తన అందం అభినయంతో ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. చూడ్డానికి పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది. దివ్యవాణి సర్దార్ కృష్ణమనాయుడు సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. టాలీవుడ్ లో పెళ్లిపుస్తకం సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.
Advertisement
ఆ తరవాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇక పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెప్పి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ లోనూ నటించి అభిమానులకు దగ్గరయ్యింది. అంతే కాకుండా రాజకీయాల్లోకి ఎంట్రీఇచ్చి టీడీపీలో కొనసాగుతోంది. కాగా తాజాగా దివ్యవాణి తన పర్సనల్ లైఫ్ మరియు సినిమా లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
Advertisement
భర్త నుండి తాను విడిపోయినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పింది. ఆయనకు ఉన్న పనివల్ల కర్నాటక నుండి ఆంధ్ర వరకు తిరుగుతూ ఉంటారని చెప్పింది. అందువల్లే తమ వద్ద ఎక్కువగా ఉండరని తెలిపింది. అంతేకాకుండా ఆయనతో ఎలాంటి గొడవలు లేవని..సినిమాలు మానేయాలని రాజకీయాల్లోకి వెళ్లొద్దని ఆయన ఎప్పుడూ చెప్పలేదని వెల్లడించింది. సినిమా వాళ్లను రాజకీయాల్లో చులకనగా చూస్తారని చెప్పింది. అందంగా ఉంటానని సినిమాల మాదిరిగానే రాజకీయాల్లోనూ అడ్వాంటేజ్ తీసుకుందామని చూస్తారని కానీ ఎవ్వరికీ ఆ చనువు ఇవ్వలేదని వెల్లడించింది.