నిన్న వాలెంటైన్స్ డే సంధర్భంగా సెలబ్రెటీలు సోషల్ మీడియాలో తమ ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్ట్ లు పెట్టారు. ప్రస్తుతం లవ్ లో ఉన్న సెలబ్రెటీలు పెళ్లి చేసుకున్న సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. అంతే కాకుండా బ్రేకప్ చెప్పుకున్న జంటలు కూడా ప్రేమ గురించి పోస్ట్ లు పెట్టడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే శ్రీజ మరియు కల్యాణ్ దేవ్ షేర్ చేసిన పోస్ట్ లు హాట్ టాపిక్ గా మారాయి.
Advertisement
చిరంజీవి కూతురు శ్రీజ మొదటి భర్తతో విడాకుల తరవాత కల్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది. చిరంజీవి కుటుంబం వీరి వివాహాన్ని ఘనంగా జరిపించింది. అయితే కొంతకాలంగా శ్రీజ కల్యాణ్ లు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా కల్యాణ్ దేవ్ ను హీరోగా పరిచయం చేసిన మెగా ఫ్యామిలీ అతడిని పక్కన పెట్టేసింది.
Advertisement
మొదట కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన విజేత సినిమా ప్రమోషన్స్ లో మెగాఫ్యామిలీ కనిపించింది. కానీ ఆ తరవాత కల్యాణ్ దేవ్ సినిమాలు చేసినా మెగాఫ్యామిలీ నుండి ఎలాంటి సపోర్ట్ అందండం లేదు. దాంతో వీరిద్దరి విడాకులు దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది.
ఇక వీరికి ఓ పాప ఉండగా పాప ఫోటోలను వీడియోలను ఇద్దరూ షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే వాలెంటైన్స్ డే రోజున కల్యాణ్ దేవ్ తన సోషల్ మీడియాలో….ఎదుటివారిని ఎంత ఇష్టపడుతున్నావనేదానికంటే వాళ్ల చేత ఎలా ట్రీట్ చేయబడుతున్నావ్ అనేదే ముఖ్యం..అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా శ్రీజ తన పోస్ట్ లో….
ALSO READ :రాజమౌళి తీరుతో కోపానికి గురైన సీనియర్ నటుడు ఎవరో తెలుసా ?