మెగాస్టార్ కూతురు శ్రీజ భర్త కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. మొదటి భర్తతో విడాకుల తరవాత శ్రీజ కల్యాణ్ దేవ్ ను రెండో వివాహం చేసుకుంది. ఆ తరవాత కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అయ్యాడు. 2018 సంవత్సరంలో కల్యాణ్ దేవ్ విజేత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మెగా సపోర్ట్ ఉండటంతో కాస్త క్రేజ్ వచ్చింది. ఆ తరవాత సూపర్ మచ్చి, కిన్నెరసాని అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.
Advertisement
అంతే కాకుండా శ్రీజ కొన్నేళ్లుగా కల్యాణ్ కు దూరంగా ఉండటంతో పాటూ సైలెంట్ గా విడాకులు కూడా తీసుకున్నారంటూ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కల్యాణ్ దేవ్ ను మెగాఫ్యామిలీ పక్కనపెట్టేసిందనే టాక్ కూడా ఉంది.
Advertisement
ఈ నేపథ్యంలోనే కల్యాణ్ దేవ్ సినిమా ఫంక్షన్ లకు కూడా రావడం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటి వరకూ కల్యాణ్ దేవ్ శ్రీజ విడాకులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ శ్రీజ తన సోషల్ మీడియా నుండి కల్యాణ్ దేవ్ ఫోటోలను ఇప్పటికే డిలీట్ చేసింది. అంతే కాకుండా కల్యాణ్ దేవ్ అన్ ఫాలో చేసింది.
ఇదిలా ఉంటే వీరిద్దరికీ ఓ పాప కూడా జన్మించిన సంగతి తెలిసిందే. కాగా నేడు కల్యాన్ దేవ్ తన పుట్టిన రోజును కూతురుతో కలిసి జరుపుకున్నాడు. ఫోటోలలో కూతురు మరియు కల్యాణ్ దేవ్ మాత్రమే కనిపిస్తున్నారు. నీ నాలువ ఏటనే నేను పుట్టినరోజు జరుపుకుంటూ కొత్తఏడాదిలో అడుగుపెడుతున్నా…నిన్ను ప్రేమిస్తూనే ఉంటా..ఇప్పుటికే నిన్ను మిస్ అవుతున్నా అంటూ కల్యాణ్ దేవ్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు.
ALSO READ : అలాంటి ప్రశ్నవేసిన నెటిజన్….చెప్పు చూపిస్తూ అషురెడ్డి షాకింగ్ రిప్లై..!