Home » రాత్రిపూట ఈ పండ్ల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌..! తింటే ఏం జ‌రుగుతుందంటే..?

రాత్రిపూట ఈ పండ్ల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ట‌..! తింటే ఏం జ‌రుగుతుందంటే..?

by AJAY
Ad

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం…ఆరోగ్యం స‌రిగా లేక‌పోతే కోట్లు ఉన్నా వృథానే. అయితే ఆరోగ్యంగా ఉండ‌టం కోసం కొంత‌మంది శ్ర‌ద్ద‌తీసుకుంటారు. మ‌రికొంద‌రు అనారోగ్యం పాలయ్యేవ‌ర‌కూ ప‌ట్టించుకోరు. కానీ మ‌న శ‌రీరాన్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి. ఏం తినాలి ఎంత తినాలి ఎప్పుడు తినాలి అనే రూల్స్ తెలిస్తే అనారోగ్యానికి గుర‌య్యే అవ‌కాశాలు సగం త‌గ్గిన‌ట్టే. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం తో పాటూ పండ్లు కూడా తినాల‌ని డాక్ట‌ర్ లు చెబుతుంటారు. ఒక్కో పండులో శ‌రీరానికి మంచి చేసే కొన్ని గుణాలు ఉంటాయి.

Advertisement

అంతే కాకుండా సీజ‌న‌ల్ పండ్ల‌ను తినండం వ‌ల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంద‌ని డాక్ట‌ర్ లు చెబుతున్నారు. అయితే పండ్లను ఏ స‌మ‌యానికి తినాలో కూడా తెలిసి ఉండాల‌ని ఆరోగ్య‌నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా రాత్రి వేళ కొన్ని పండ్ల‌ను అస్స‌లు తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు. ఆ పండ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం…అరటి పండును ప‌డుకునేముందు తిన‌కూడద‌ని ఆరోగ్య‌నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

అర‌టి పండు శ‌రీరంలో వేడిని పెంచుతుంద‌ని కాబ‌ట్టి రాత్రిపూట తిన‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. అర‌టిపండు ప‌డుకునేముందు తిన‌డం వ‌ల్ల రాత్రి చేసిన భోజనం అర‌గ‌కుండా ఉంటుంద‌ని దాని వ‌ల్ల గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు వ‌స్తాయని చెబుతున్నారు. స‌పోటా కూడా రాత్రిపూట తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు. స‌పోటాలో చ‌క్క‌ర శాతం ఎక్కువ ఉంటుంది. ఆ పండు తిన‌డం వల్ల చ‌క్కర అధిక‌రంగా ర‌క్తంలో క‌లిసే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి రాత్రిపూట స‌పోటా తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు.

అంతే కాకుండా యాపిల్ ను కూడా రాత్రిపూట తిన‌కూడ‌ద‌ని చెబుతున్నారు. యాపిల్ లో ఉండే అక్జాలిక్ యాసిడ్ వ‌ల్ల అసిడిటి స‌మ‌స్య‌లు వస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. సిట్ర‌స్ ఫ్రూట్స్ ను కూడా రాత్రిస‌మ‌యాల‌లో తిన‌కూడ‌ద‌ని ఆరోగ్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. సిట్ర‌స్ పండ్లు సాధార‌ణంగా పుల్ల‌గా ఉంటాయి. కాబ‌ట్టి వాటిని రాత్రిపూట తిన‌డం వ‌ల్ల ఎసిడిటీ గ్యాస్ స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ALSO READ : ఈ 6 రాశులు గల అమ్మాయిలతో జాగ్రత్త.. లేదంటే భర్తను డామినేట్ చేస్తారు..!

Visitors Are Also Reading