Home » సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు… సమన్లు జారీ చేసిన కోర్టు

సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానాపై క్రిమినల్ కేసు… సమన్లు జారీ చేసిన కోర్టు

by Bunty
Ad

టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు గురించి తెలియని వారు ఉండరు. రామానాయుడు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా సూపర్ సక్సెస్ తో దూసుకుపోతున్నారు. ఆయన ఇంకా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు కూడా హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి మన అందరికీ తెలిసిందే. సురేష్ బాబు 1990లో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలి రాజా సినిమాతో నిర్మాతగా మారారు.

Advertisement

ఇదిలా ఉండగా, నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా వివాదంలో చిక్కుకున్నారు. ఫిలింనగర్ లాండ్ వివాదంలో కొత్త మలుపు. సురేష్ బాబు, రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయింది. దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో తెలిపారు.

Advertisement

ఫిర్యాదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. బాధితులు సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు. ఈ వ్యవహారంపై గతంలోనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు జోక్యం చేసుకోకపోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

READ ALSO : క్రికెటర్లు లంచ్ బ్రేక్ లో ఏం తింటారో తెలుసా?

Visitors Are Also Reading