Amigos Movie Review : బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా అమిగోస్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రతి సినిమాకు విభిన్నమైన కథను ఎంచుకుంటూ, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న కళ్యాణ్ రామ్ ఈసారి అమిగోస్ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.
READ ALSO : Pawan Kalyan: రెండోసారి దేవుడిగా చేయనున్న పవన్ కళ్యాణ్
Kalyanram Amigos Movie Story in Telugu: కథ మరియు వివరణ:
ఇక ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించాడు. సిద్ధార్థ్ అనే బిజినెస్మెన్ గా, మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో, మైకేల్ అనే గ్యాంగ్ స్టార్ గా మూడు సరికొత్త పాత్రల్లో కనిపించాడు నందమూరి హీరో. ఈ ముగ్గురు ఎదురైన తర్వాత జరిగే సంఘటనలు ఆధారంగా సినిమా తెరకెక్కింది. అసలు ఈ ముగ్గురి మధ్య రక్తసంబంధం ఉందా? లేక పోలికలు మాత్రమే కలిగి ఉన్నారా? ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ పాత్ర అయిన మైకేల్, తనలా ఉండే ఆ ఇద్దరు పాత్రను ఎలా ఉపయోగించుకున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
ఈ ముగ్గురు కలిసినప్పుడు ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ముఖ్యంగా గ్యాంగ్ స్టార్ పాత్రలో మైకేల్ మిగిలిన ఇద్దరినీ తనకు అనుకూలంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ గ్యాంగ్ స్టార్ ఈ ఇద్దరిని ఎలా వాడుకొని NIA వాళ్ళనుంచి తప్పించుకున్నాడు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయ్యింది. ఈ విషయంలో మిగిలిన రెండు పాత్రలు కావాలని సపోర్ట్ చేశాయా? లేక అది గ్యాంగ్ స్టార్ మాయా, ఈ మూడు పాత్రలు ఎదురైన తర్వాత వారి జీవితంలో జరిగిన సంఘర్షణలు ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఇక ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే పాజిటివ్, నెగిటివ్ పాత్రల్లో హీరో కమ్ విలన్ గా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించాడు. మూడు పాత్రలో మూడు వేరియేషన్స్ చూపించడం అంటే పెద్ద టాస్క్ అని చెప్పాలి. కానీ ఆ విషయంలో నందమూరి హీరో ఓ రెండు మెట్లు ఎక్కారు. రీసెంట్ గా బింబిసారలో కూడా రెండు విభిన్న పాత్రల్లో అలరించిన ఈ నందమూరి హీరో ఈ సినిమాలో మూడు పాత్రలో మూడు డిఫరెంట్ మ్యానరిజం చూపించాడు. ఇక ఈ సినిమాకు హీరోయిన్ ఆషిక గ్లామర్ బాగా ప్లస్ అయింది. ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.
ప్లస్ పాయింట్లు:
కళ్యాణ్ రామ్ నటన
కామెడీ సీన్లు
మైనస్ పాయింట్లు:
రోటీన్ నేరేషన్
ఊహించదగిన స్క్రీన్ ప్లే
రేటింగ్: 2.75/5
read also : NTR “కొండవీటి సింహం”లో చిరును తప్పించి.. మోహన్ బాబుకు ఛాన్స్…దీనికి అసలు కారణం ఇదే!