Home » స్వయంకృషి షూటింగ్.. గాడ నిద్రలో ఉన్న చిరు..కె.విశ్వనాథ్ ఏం చేశారంటే..?

స్వయంకృషి షూటింగ్.. గాడ నిద్రలో ఉన్న చిరు..కె.విశ్వనాథ్ ఏం చేశారంటే..?

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు అంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంది.. ఎన్నో పస్తులున్న రోజులు కూడా ఉన్నాయట.. ముఖ్యంగా చిరు తన పిజక్ మెయింటైన్ చేయడం కోసం చాలా ఇబ్బందులు పడ్డారట.అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు కాబట్టి 6 పదుల వయసులో కుర్ర హీరోలతో సమానంగా పోటీ పడుతున్నారు. అప్పట్లో సినిమా షూటింగ్ అందరూ మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం పండ్ల జ్యూస్ తాగి పడుకునే వారట.. దీనికి కారణం ఏంటంటే.. భోజనం చేస్తే యాక్టివ్ నెస్ పోయి కాస్త లేజీగా అవుతారని భావించే వారట. వాళ్లంతా భోజనం చేస్తుంటే చిరు పడుకునే వారట.

Advertisement

ఎలాంటి సమయంలో కూడా మధ్యాహ్న సమయంలో భోజనం చేసేవారు కదట. కానీ స్వయంకృషి సినిమా షూటింగ్ లో ఒక ఆసక్తికరమైన సన్నివేశం షూట్ చేసుకుంది. చిరంజీవి ఉన్న ఇల్లు శ్రీరంగపట్నం నదీ పక్కన సెట్ వేశారు. వరదల దాటికి అది కొట్టుకుపోయింది. ఇక లాభం లేదనుకొని అలాంటి సెట్ చెన్నైలోని కృష్ణ గార్డెన్ లో వేసి, చిరంజీవి విజయశాంతిల మీద ఒక సన్నివేశాన్ని చిత్రించారు. ఆ తర్వాత కంచిలో షూటింగ్ జరుగుతోంది. ఓ రోజు మధ్యాహ్నం దర్శకుడు విశ్వనాథ్ భోజనం చేస్తుండగా హీరో కోసం చూస్తున్నారు. ఆయన వాహనంలో భోజనం చేస్తున్నారేమో అనుకున్నారట. కానీ చిరంజీవి ఓ చెట్టు కింద పడుకొని ఉన్నారు. చిరు భోజనం చేశారా అని సిబ్బందిని అడిగితే, సార్ మధ్యాహ్నం తినరు సార్ అసిస్టెంట్ చెప్పాడట. అదేంటి కొంచమైనా తినాలి కదా. వెంటనే పెరుగన్నం ఓ ప్లేట్లో కలిపారట విశ్వనాథ్ గారు.

Advertisement

వెంటనే యూనిట్ లోని ఒక వ్యక్తికి జాగ్రత్తగా ఇచ్చి చిరంజీవి గారిని తినమని చెప్పు, నేను తినమన్నానని చెప్పు అని చెప్పారు. ఆ ప్లేట్ పట్టుకొని ఆ వ్యక్తి చిరంజీవి దగ్గరికి వెళ్లారు. కానీ చిరు గాడ నిద్రలో ఉన్నారు. ఒకవేళ లేపితే తిడతారేమోనని భయంతో ఉన్నాడట అసిస్టెంట్. ఆ టైంలోనే కంచి ఆలయంలో గుడికంట గట్టిగా మోగడంతో చిరంజీవికి మెలకువ వచ్చిందట. లేచిన వెంటనే ఆ వ్యక్తిని ఏంటి అని అడిగితే డైరెక్టర్ గారు పెరుగన్నం పంపించారు. తానే స్వయంగా కలిపారు మీకు ఇవ్వమన్నారు సార్ అని చెప్పాడు. వెంటనే కంచి ఆలయంలో నాకు దొరికిన ప్రసాదం ఇది అంటూ గబగబా తినేసారట చిరంజీవి. ఆ రుచిని ఆయన నేటికీ మర్చిపోలేనని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు చిరంజీవి.

also read:

Visitors Are Also Reading