చిరంజీవి నటవారసుడు గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. డ్యాన్స్ మరియు నటన లో అదరగొడుతూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా తో చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వం లో మరో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
Advertisement
ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ చిన్నారిని కలిసి ఆ చిన్నారి కోరిక తీర్చాడు. తొమ్మిదేళ్ళ వయసున్న మణికుషాల్ అనే అబ్బాయి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ కుర్రాడు హైదరాబాద్ లోని స్పర్శ్ ఆస్పత్రి లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆ అబ్బాయి రామ్ చరణ్ కు వీరాభిమాని దాంతో రామ్ చరణ్ ను కలవాలని అనుకున్నాడు. అదే విషయం పేరెంట్స్ కు చెప్పాడు.
Advertisement
కాగా మేక్ ఎ విష్ అనే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఈ విషయాన్ని రామ్ చరణ్ దృష్టికి తీసుకువెళ్ళారు. దాంతో రామ్ చరణ్ స్పందించి వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఆ బాలుడిని కలిసి మాట్లాడాడు. అంతే కాకుండా ఆ బాలుడికి ఓ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఆ తరవాత బాలుడిలో ధైర్యం నింపాడు. కాగ్ రామ్ చరణ్ ఆస్పత్రికి వెళ్లి కలిసిన ఫోటో లు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.