తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా మహేష్ బాబు పేరే ముందుగా చెప్పుకోవచ్చు. అలాంటి మహేష్ బాబు హీరోగా, ఇలియానా హీరోయిన్ గా వచ్చిన పోకిరి మూవీ 28-4- 2006లో గ్రాండ్ గా రిలీజ్ అయింది.
Advertisement
ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇందులో 10 కోట్ల బడ్జెట్ పెడితే 66 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ కథ నుండి సాంగ్స్ వరకు అన్ని అభిమానులను ఆకట్టుకున్నాయి.
Advertisement
ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది “గలగల పారుతున్న గోదారిలా, జలజల జారుతుంటే కన్నీరెలా”.. అనే సాంగ్ ఎంతటి హిట్ అయిందో మనందరికీ తెలుసు. అయితే ఈ పాటను ఒక పాత మూవీ నుంచి లేపేశారు.. కృష్ణా నటించిన గౌరీ అనే మూవీ నుంచి ఈ పాటను తీసుకొని కాస్త చేంజింగ్ చేసి పోకిరి సినిమాలో మనకు అందించారు.. ఈ చిత్రంలో జమున హీరోయిన్, కథ రాసింది ఎన్ వి సుబ్బారావు.. అలాగే ఈ మూవీలో అల్లు రామలింగయ్య, రావుగోపాలరావు సత్యనారాయణ వంటి వారున్నారు.. ఇక ఈ సినిమాకు పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పవచ్చు. ఇందులో ఎస్పీ బాలసుబ్రమణ్యం, సుశీల పాడిన సాంగ్స్ ఎంతో హిట్ అయ్యాయని చెప్పవచ్చు..
https://www.facebook.com/reel/1148729859163037?mibextid=6AJuK9&s=chYV2B&fs=e
అయితే ఈ సినిమాలో ఉండే గల గల పారుతున్న గోదారి అనే సాంగ్ అప్పట్లో జనాలకి చాలా కనెక్ట్ అయింది. అలాంటి ఈ పాటను పోకిరి సినిమాలో కాస్త మోడిఫికేషన్ చేసి అందించారనే విషయం చాలామందికి తెలియదు. ప్రస్తుతం గౌరీ సినిమాకు సంబంధించిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇది చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఈ పాటను ఆ మూవీ నుంచి లేపేసారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. మరెందుకు ఆలస్యం మీరు కూడా చూసి కామెంట్ పెట్టండి.
also read: