పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాడు. పవన్ హిట్ సినిమాల్లో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా యూత్ కు బాగా నచ్చేసింది. సినిమాలోని పాటలు సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా 1999 సంవత్సరం లో విడుదలయ్యింది. అయితే ఈ చిత్రం తోనే హీరోయిన్ అదితి గోవిత్రికర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
Advertisement
అంతే కాకుండా మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఈ చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ తనదైన ముద్ర వేసుకుంది. ఈ సినిమా తరవాత అదితి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సోచ్ అనే బాలీవుడ్ సినిమాలో నటించింది. ఆ తరవాత మరో నాలుగైదు సినిమాల్లో నటించింది. కానీ ఒక్క సినిమా కూడా సూపర్ హిట్ అవ్వలేదు.
Advertisement
సినిమా ఆఫర్ లు లేకపోవడం తో సీరియల్స్ కూడా నటించింది. అక్కడ కూడా కెరీర్ సో సో గానే సాగింది. అంతే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా అదితి అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా ఆఫర్ లు లేకపోవడం తో నటన కు గుడ్ బై చెప్పింది. ఇక అదితి ప్రస్తుతం లండన్ లోని హార్వర్డ్ యునివర్సిటీ లో సైకాలజీ లో రెండో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది.
ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ 1998 లోనే దావూడి బోహ్రా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల దూరయ్యారు….ఆ తరవాత 2007 లో విడాకులు కూడా తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ ముంబై లో పిల్లల తో కలిసి ఉంటోంది.
Also read : ఈ 3 యోగాసనాలు క్యాన్సర్ రాకుండా కాపాడగలవు అనే విషయం మీకు తెలుసా ?