టీమిండియా క్రికెటర్ దీపక్ చాహర్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ఆల్ రౌండర్ గా సేవలందిస్తున్నాడు దీపక్ చాహార్. టీమిండియా తరఫున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టీ 20 మ్యాచ్ ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. అటు దీపక్, జయ భరద్వాజ్ ల వివాహం జరిగింది. వీరిద్దరూ చాలా కాలం ప్రేమించుకొని వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
కాగా దీపక్ చాహార్ భార్య జయ భరద్వాజ్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ.10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చాహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే, రిక్ స్పోర్ట్స్ యజమాని ధృవ్ పరేక్, అతని తండ్రి జయ భరద్వాజ్ దగ్గర రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
Advertisement
Advertisement
వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్ లో రూ. 10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్టు తెలుసుకున్న జయ భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని, చంపేస్తామంటూ బెదిరించాలని దీపక్ చాహార్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
READ ALSO : మందు బాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..బాటిల్ కొనాలంటే ఇక నగదు అవసరం లేదు!