పోసాని కృష్ణ మురళి టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. పోసాని ఒకప్పుడు డైరెక్టర్ మంచి హిట్ లు అందుకున్నాడు. అంతకముందు కథా రచయితగా పనిచేశాడు. డిఫరెంట్ సినిమా ల తో పోసాని ప్రేక్షకులను మెప్పించాడు. ఇక మెంటల్ కృష్ణ సినిమాలో ప్రధాన పాత్రలో నటించి నటుడు గా కూడా ప్రశంసలు అందుకున్నాడు.
Advertisement
ఆ తరవాత స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు అందుకుని బిజీ నటుడు గా మారిపోయాడు. అంతే కాకుండా పోసాని రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నాడు. వైసీపీ కి సపోర్ట్ చేస్తూ ఆ పార్టీని విమర్శించే వాళ్ళ పై పోసాని తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటాడు.
Advertisement
ఈ నేపథ్యంలోనే చిరు అప్పట్లో పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించాడు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారు. ఇదిలా ఉంటే పోసాని తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన జీవితంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సుమ యాంకర్ గా చేసిన ఆ షో లో పోసాని మాట్లాడుతూ….తాను ఫేస్ బుక్ ….వాట్సప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు వాడనని చెప్పాడు. అంతే కాకుండా తాను ఇప్పటికీ డబ్బా ఫోన్ వాడుతున్నా అని తెలిపాడు.
అంతే కాకుండా తన తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడని ఎమోషనల్ అయ్యాడు. ఆయన కు ఎలాంటి చెడు అలవాట్లు లేవని….కానీ ఒకడు పేకాట ఆడటం నేర్పించాడు అని అన్నాడు. అయితే ఊర్లో అందరూ సబ్బారావు ఇలా చేస్తున్నావ్ ఏంటి అని విమర్శించారని అన్నాడు. దాంతో ఆ అవమానం తట్టుకోలేక నా చిన్న వయసులోనే పొలానికి వెళ్లి పురుగుల మందు తాగి నాన్న చనిపోయారని పోసాని ఎమోషనల్ అయ్యాడు.
Also read : సమంతకు సెంటిమెంట్ కూడా ఉందా.. అందుకే ఆ రంగు రాళ్ళను దరిస్తుందా.. దీనికీ కారణం?