టి20 చరిత్రలోనే టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్ బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్ లో… సమిష్టిగా రాణించిన టీమ్ ఇండియా 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. దీంతో టి20 చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా నయా చరిత్రను లిఖించింది.
Advertisement
ఈ గెలుపుతో మూడు టి20 సిరీస్ ను టీమిండియా 3-1 తేడాతో కైవసం చేసుకుంది. మరోవైపు ఘోర పరాజయంతో న్యూజిలాండ్… చెత్త రికార్డును తమ పేరిట నమోదు చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 126 పరుగులు చేయగా రాహుల్ త్రిపాటి 44 పరుగులు చేశాడు.
Advertisement
న్యూజిలాండ్ బౌలర్లలో బ్రెస్ వెల్ , టిక్నర్, సోది, డారిల్ మిచెల్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్షచేదనకు దిగిన న్యూజిలాండ్ జట్టు 12 ఓవర్లలో 66 పరుగులకే కుప్ప కూలింది. ఈ నేపథ్యంలో టీమిండియా టి20 సిరీస్ కూడా సొంతం చేసుకుంది.
Read Also : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి
𝙒.𝙄.𝙉.𝙉.𝙀.𝙍.𝙎! 🏆#TeamIndia | #INDvNZ pic.twitter.com/130FFN6Xhr
— BCCI (@BCCI) February 1, 2023