నందమూరి తారక రత్న కు జనవరి 27వ తేదీన గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో తారకరత్నను చూసేందుకు టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆ ఆసుపత్రికి వస్తున్నారు. ఈ తరుణంలోనే తాజాగా తారకరత్న ఉన్న ఆసుపత్రికి… వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వచ్చారు.
Advertisement
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నందమూరి తారకరత్న ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆయన వివరించారు. డాక్టర్లు చాలా అద్భుతంగా చికిత్స అందిస్తున్నారని తెలిపారు. తారకరత్న కు గుండెపోటు వచ్చిన రోజు 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వల్ల మెదడుకు రక్తప్రసరణ నిలిచిపోయింది… ఆ కారణంగా మెదడుపై భాగం దెబ్బతిన్నదని సాయి రెడ్డి తెలిపారు.
Advertisement
రక్త ప్రసరణ నిలిచిపోవడం వల్ల కొంత వాపు ఏర్పడిందని… వాపు కు సంబంధించిన ప్రోగ్రెషన్ నాలుగు రోజుల వరకు ఉంటుందని తెలిపారు. డాక్టర్లు చెప్పిన టైం నేటితో ముగిస్తుంది కాబట్టి త్వరలో తారకరత్న కోరుకుంటాడని ఆశిస్తున్నామని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. నందమూరి బాలకృష్ణ వైద్య సదుపాయానికి సంబంధించిన విషయాలను తానే దగ్గరుండి చూసుకుంటున్నారని వెల్లడించారు. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి…విజయ సాయిరెడ్డి భార్య సోదరి కూతురు. ఈ తరుణంలోనే తారకరత్నను విజయసాయిరెడ్డి చూసేందుకు వచ్చారు.
Read Also : తారకరత్న హెల్త్ బులిటెన్.. బ్రెయిన్ ఎఫెక్ట్ అయినట్లు వైద్యుల ప్రకటన !