నందమూరి తారకరత్న కు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 27వ తేదీన తెలుగుదేశం పార్టీ అధినేత నారా లోకేష్ యువ గళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో సీనియర్ ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న పాల్గొన్నారు. గత నెల రోజుల నుంచి తెలుగుదేశం పార్టీలో ఫుల్ యాక్టివ్ గా కనిపించిన నందమూరి తారకరత్న… వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం కూడా జరిగింది.
Advertisement
అయితే నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రోజే… కార్యకర్తల తాకిడి ఎక్కువగా ఉండడంతో నందమూరి తారకరత్నకు గుండెపోటు వచ్చింది. దీంతో.. నందమూరి తారకరత్న ను అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మాత్రం… తారకరత్నను నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ICU లో చికిత్స పొందుతున్నాడు నందమూరి తారకరత్న.
Advertisement
ఇక తారకరత్నను చూసేందుకు నందమూరి కుటుంబం మొత్తం కదిలి వచ్చింది. అటు టాలీవుడ్ తారలు కూడా నందమూరి తారక రత్న త్వరగా కోలుకోవాలని వరుసగా ట్వీట్లు చేస్తు న్నారు. ఈ తరుణంలో తాజాగా నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం నందమూరి తారకరత్న హెల్త్ బులి టెన్ ను విడుదల చేసింది. నందమూరి తారకరత్న బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని సిటీ స్కాన్ రిపోర్టు ద్వారా వైద్యులు తెలిపారు. ఆయన హెల్త్ కండిషన్ ప్రస్తుతం క్రిటికల్ గానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక బ్రెయిన్ రికవరీపై వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also : Jabardasth : జబర్దస్త్ కి దిష్టి తగిలిందా..? అదిరే అభి సంచలన పోస్ట్