సీనియర్ ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ జనవరి 27వ తేదీన పాదయాత్ర భారీ కార్యకర్తల మధ్య ప్రారంభించారు. ఈ తరుణంలోనే నందమూరి తారకరత్నకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడే ఉన్న కార్యకర్తలు అతన్ని కుప్పంలోని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయ గుండె ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రస్తుతం తారకరత్న నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
Advertisement
ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. సినీతారలు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే కళ్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేశారు.
Advertisement
“సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంకా ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. తను త్వరలో పూర్తిస్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి, ఆ భగవంతుడికి కృతజ్ఞతలు” అంటూ చిరు ట్వీట్ చేశారు. కాగా, ఆసుపత్రి నుంచి నిన్న రాత్రి బాలయ్య హైదరాబాద్ వచ్చారు. మళ్ళీ రేపు బెంగళూరు వెళ్ళనున్నారు.
సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు,ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ,ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి
ఆ భగవంతుడికి కృతజ్ఞతలు.May you have a long and healthy life dear Tarakaratna!
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2023
READ ALSO : అంబానీ కొడుకు మళ్లీ బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా! తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.