తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయింది. ఈ సినిమాతో విజయ్.. చిరంజీవి, బాలయ్యతో పోటీపడ్డారు. అయితే సంక్రాంతి రేసులో విజయ్ గెలవలేకపోయారు. కానీ తమిళనాడులో విజయ్ వారసుడు కు భారీ కలెక్షన్ లు వచ్చాయి. ఇదిలా ఉంటే విజయ్ కి సంబంధించిన కొన్ని వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో విజయ్ కి తన తండ్రితో ఉన్న విభేదాల గురించి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
విజయ్ తన తండ్రి చంద్రశేఖర్ తో చాలాకాలం నుండి మాట్లాడటం లేదని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. విజయ్ కి తనకు మధ్య అభిప్రాయ బేధాలు ఉన్న మాట నిజమేనని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా తన కుమారుడితో మాట్లాడటం లేదని చెప్పారు. ఇలా మా ఇంట్లో గొడవలు జరగడం సర్వసాధారణమని అన్నారు.
Advertisement
ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య గొడవలకు కారణం రాజకీయాలేనని తెలుస్తోంది. విజయ్ అనుమతి లేకుండా చంద్రశేఖర్ ఓ పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో అది తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడని ప్రకటించారు. భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి తన కుమారుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ ప్రకటించాడు.
అయితే విజయ్ మాత్రం ఆ వార్తలను కొట్టి పారేశాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదని స్పష్టం చేశాడు. అంతేకాకుండా తన తండ్రి నిర్వహించే పొలిటికల్ మీటింగ్ లకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఇక అప్పటి నుంచి విజయ్ కి చంద్రశేఖర్ తో విభేదాలు వచ్చాయని తెలుస్తోంది.