నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరో తారకరత్న. ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ తనయుడుగా తారకరత్న చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలోని పాటలతో పాటు తారకరత్న నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మాత్రం తారకరత్న కు సరైన హిట్ పడలేదు.
Advertisement
ఆ తర్వాత విలన్ గా హీరోగా రకరకాల పాత్రలు చేశాడు. అంతేకాకుండా రీసెంట్ గా ఓ సిరీస్ లో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక కేవలం సినిమాలలోనే కాకుండా తాత వారసత్వాన్ని రాజకీయాల్లోనూ తారకరత్న కొనసాగించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలంగా రాజకీయాల్లోనూ చురుకుగా వ్యవహరిస్తున్నాడు. కాగా నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రలోనూ తారకరత్న పాల్గొన్నారు.
Advertisement
ఈ పాదయాత్రలోనే అపశృతి చోటు చేసుకుంది. తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కింద పడిపోయారు. ఆ తర్వాత సిబ్బంది మరియు టిడిపి కార్యకర్తలు కార్యకర్తలు ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అక్కడనుండి బెంగళూరులోని నారాయణ హృదయాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని సమాచారం. అయితే తాజాగా సినిమా నిర్మాత చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తారకరత్న కు సిగరెట్ తాగే అలవాటు ఉందని చిట్టిబాబు వెల్లడించారు. అంతే కాకుండా సిగరెట్ తాగే అలవాటు ఉండటం వల్లే తారకరత్న రక్త నాళాల్లో బ్లాక్ లు ఏర్పడ్డాయని చెప్పారు. మరోవైపు తారకరత్న కు అరుదైన మెలినా వ్యాధి ఉండటం వల్ల స్టంట్ వేయలేకపోతున్నారని చెప్పారు. ఇక తారకరత్న కోలుకుని మళ్లీ తిరిగి రావాలని చిట్టిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పాదయాత్రలు సభలు నిర్వహించేటప్పుడు ఇరుకు సందులను కాకుండా విశాలంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని చిట్టిబాబు సూచించారు.