Home » ప్రేమించడమే ఆ అమ్మాయి ప్రాణం తీసింది….మహారాష్ట్రలో సైరత్ సినిమా లాంటి ఘటన…!

ప్రేమించడమే ఆ అమ్మాయి ప్రాణం తీసింది….మహారాష్ట్రలో సైరత్ సినిమా లాంటి ఘటన…!

by AJAY

ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో అడుగుపెట్టాం. ఇప్పుడు 4జీ వాడుతున్నాం మరికొద్ది రోజుల్లోనే 5 జీ సేవలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంతే కాకుండా మనవాళ్ళు అంతరిక్షం లో కూడా భూములు కొంటున్నారు. అయితే టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా కూడా మనుషులు మాత్రం మారడం లేదు. కులాలు…మతాలు అని కొట్టుకుచస్తున్నారు.

కులం మతం కోసం కన్న వారిని సైతం హతమారుస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే మహరాష్ట్ర లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా లో వైద్య విద్యార్థిని పరువు హ* కు గురయ్యింది. వేరే కులం వాడిని ప్రేమించింది అని కుటుంబ సభ్యులే ఆ యువతిని హతమార్చారు. మహారాష్ట్ర లోని లిబ్ గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన శుభాంగి మెడిసిన్ చదువుతోంది. హోమియోపతీ లో మెడిసిన్ చదువుతున్న శుభాంగి కి ఇటీవలే వివాహం నిశ్చయం అయ్యింది. అయితే అప్పటికే యువతి అదే గ్రామానికి చెందిన యువకుడి తో ప్రేమలో ఉన్నానని పెళ్లి వద్దని వరుడికి చెప్పింది.

దాంతో ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. పెళ్లి క్యాన్సిల్ అవ్వడం తో యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామంలో తమ పరువు పోయింది అని తండ్రి, సోదరుడు తో మరో ముగ్గురు కలిసి యువతిని హతమార్చారు. ఆ తర్వాత పొలం వద్దకు తీసుకువెళ్ళి దహనం చేశారు. ఈ ఘటన తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతే కాకుండా హంతకుల పై కేసులు నమోదు చేశారు.

Also read : అంబానీ కొడుకు మళ్లీ బరువు పెరగడానికి కారణం ఏంటో తెలుసా! తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే.

Visitors Are Also Reading