టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సమంత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ సమంత సినిమాలు చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో నో సమంత స్టార్ హీరోయన్ గా రాణిస్తోంది. ఇక ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోనూ అభిమానులను సంపాదించుకుంది.
Advertisement
ఈ వెబ్ సిరీస్ లో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఫ్యామిలీమ్యాన్ తర్వాత సమంత బాలీవుడ్ నుండి సైతం ఆఫర్ లను అందుకుంది. ఇదిలా ఉంటే గతేడాది డిసెంబర్ లో సమంత తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత జీవితంలో బ్యాడ్ టైం మొదలైంది. విడాకుల తర్వాత వరుస సినిమాలకు సైన్ చేసిన సమంత షూటింగ్ లో బిజీ అయ్యింది.
Advertisement
అయితే యశోద సినిమాలో నటిస్తున్న సమయంలో సమంత అనారోగ్యం బారిన పడింది. సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి తో బాధపడుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఆ తరవాత సమంత మయోసైటిస్ కు చికిత్స తీసుకుంది. అంతే కాకుండా గతం లో సమంత సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనగా చిక్కిపోయినట్టు కనిపించింది.
అంతే కాకుండా సమంత చాలా కాలంగా సోషల్ మీడియా లో తన వర్కౌట్ వీడియో లను పోస్ట్ చేయడం లేదు. కాగా తాజాగా సామ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియో ను పోస్ట్ చేసింది. దాంతో సమంత కోలుకుందని మళ్లీ వర్కౌట్ లు మొదలు పెట్టింది అని అర్థం అవుతోంది. ఇక నెటిజన్లు కూడా సమంత స్ట్రాంగ్ ఉమెన్ అని ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also read :2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించిన హనీరోజ్…ఆ సినిమా ఏదంటే…?