టాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ సమయం, సందర్భం వచ్చిన ప్రతి సారి తమలో ఉన్న మంచి తనాన్ని ప్రదర్శిస్తూనే ఉంటున్నారు. వరదలు వచ్చిన సమయంలో, కరువులు వచ్చిన సమయాల్లో టాలీవుడు నటీ నటులు తమ గొప్ప మనస్సును చాటుతారు. అలాగే ఆనాథల కోసం ఎవరికైన వైద్య ఖర్చుల కోసం తమ వంతు గా సాయం చేస్తుంటారు. అయితే కొంత మంది రెగ్యూలర్ గా సాయం చేసిన ఎవరికీ తెలియకుండా ఉంటారు. అలాగే మరి కొంత మంది అయితే ఒక్కరికి సాయం చేసిన దాన్ని ప్రచారం చేసుకుంటారు.
Advertisement
Advertisement
అయితే మంచి పనులు చేయడం లో హీరోలతో సమానం గా హీరోయిన్స్ కూడా ఒక అడుగు ముందే ఉన్నారు. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన సమంత కూడా పలు సేవ కార్యక్రామాలతో బిజీ గా ఉంటారు. ఇప్పటి వరకు హీరోయిన్ సమంత చాలా మందికి సాయం చేశారు. కానీ ఆమె గొప్ప మనస్సు ను ఎప్పుడూ కూడా బయట పెట్టలేదు. సమంత ప్రత్యూష అనే సంస్థ ద్వారా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించింది. ఈ ప్రత్యూష్ అనే సంస్థ ద్వారా చిన్న పిల్లలకు ఆడ పిల్లలకు సంబంధించిన ఎలాంటి సమస్య లను ఉన్నా.. తానే ఖర్చు లను భరిస్తూ చికిత్సను అందిస్తూ వచ్చింది.
తాను సినిమాల ద్వారా సంపాదించిన డబ్బు లో కొంత శాతం ఈ ప్రత్యూష అనే సంస్థ ద్వారా మంచి పనులు చేయడానికి ఉపయోగించే వారు. అలా మంచి పనులు చేస్తు పబ్లిసిటీ చేసుకోకుండా తోటీ నటీ నటులకు సమంత ఆదర్శంగా నిలుస్తుంది. ప్రస్తుతం నాగ చైతన్య తో విడుకులు తీసుకున్న తర్వాత కూడా సమంత యాక్టింగ్ లో దూకుడు గా వ్యవహరిస్తుంది. ప్రస్తుతం సమంత పాన్ ఇండియా సినిమా యశోద తో పాటు హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తుంది.