Home » అజ్ఞాతంలోకి మెగాడాటర్ నిహారిక…కారణం అదేనా …,?

అజ్ఞాతంలోకి మెగాడాటర్ నిహారిక…కారణం అదేనా …,?

by AJAY
Ad

మెగా డాటర్ నిహారిక అంటే పరిచయం అక్కర్లేని పేరు. మెగా ఫ్యామిలీ నుండి చాలామంది హీరోలు పరిచయం కాగా నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు ముద్దుల కూతురు నిహారిక మొదట ఢీ షో కి యాంకర్ గా వ్యవహరించారు. అనుభవం లేకపోయినప్పటికీ యాంకర్ గా బుల్లితెరపై అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాకుండా నిహారిక పింక్ ఎలిఫెంట్ బ్యానర్ పేరుతో సొంత బ్యానర్ ను ప్రారంభించి పలు వెబ్ సిరీస్ లను నిర్మించారు.

Advertisement

ఆ తర్వాత “ఒక మనసు” సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా అనుకున్న మేర విజయం సాధించకపోయినప్పటికీ నిహారిక నటనకు అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత కూడా నిహారిక సినిమా ఆఫర్ లను అందుకున్నారు. నేను శైలజ సినిమాలో కీర్తి సురేష్ స్థానంలో నటించే ఆఫర్ మొదట నిహారిక వద్దకే వెళ్ళింది. కానీ నిహారిక ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నారు.

Advertisement

ఇక హీరోయిన్ గా సక్సెస్ అవ్వకపోవడంతో నిహారిక తాను ప్రేమించిన చైతన్యను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య రాజస్థాన్ లోని జైపూర్ లో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి తరవాత నిహారిక సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటూ వచ్చింది. తరచూ ఫోటోలు పెడుతూ చాలా యాక్టివ్ గా ఉండేది. అయితే గతంలో కొద్దిరోజులు నిహారిక తన ఇన్ స్టా అకౌంట్ డియాక్టివేట్ చేసుకుంది.

niharika konidela

niharika konidela

కానీ మళ్ళీ ఆ తర్వాత చాలా కాలానికి యాక్టివేట్ చేసుకుంది. తన జిమ్ ట్రైనర్ తో సన్నిహితంగా ఉన్న వీడియోలను షేర్ చేయడం వల్ల అత్తమామలు మందలించడంతోనే నిహారిక అలా చేసిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇక ఇప్పుడు మరోసారి నిహారిక సోషల్ మీడియా లో సైలెంట్ అయింది. దానికి కారణం సోషల్ మీడియా ద్వారా అనవసరమైన కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయని నిహారిక ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిహారిక ఈ విషయంపై స్పందిస్తుందో లేదో చూడాలి.

Also read : 2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించిన హనీరోజ్…ఆ సినిమా ఏదంటే…?

Visitors Are Also Reading