Home » ఏపీలో బాయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకున్న యువతులు…వీడియో వైరల్…!

ఏపీలో బాయ్ ఫ్రెండ్ కోసం కొట్టుకున్న యువతులు…వీడియో వైరల్…!

by AJAY
Ad

అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవలు పడటం ఆ గొడవలు కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం ఎన్నో చూశాం. సినిమాల్లో అయితే హీరోయిన్ల కోసం హీరోలు గొడవ పడటం చాలా కామన్ కూడా… కానీ అబ్బాయిల కోసం అమ్మాయిలు గొడవ పడటం చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అలాంటి ఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది. బాయ్ ఫ్రెండ్ కోసం ఇద్దరు అమ్మాయిలు ఏకంగా రోడ్డుపైనే జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

 

అనకాపల్లి ఆర్టీసీ బస్టాండ్ లో ఇద్దరు యువతులు బూతులతో తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలు గొడవ పడ్డారు. ఒక అబ్బాయి కోసమే ఇద్దరూ గొడవ పడ్డారని అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. వారిని ఆపేందుకు చుట్టూ ఉన్న వాళ్ళు ప్రయత్నించినప్పటికీ వాళ్ళు మాత్రం తగ్గేది లేదంటూ తన్నుకున్నారు. ఇక ఇద్దరు యువతులు కొట్టుకుంటూ ఉంటే చుట్టూ ఉన్న కొంతమంది విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

 

కొంతమంది అయితే వారిని ఎంకరేజ్ చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆ ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారితోపాటు ఆ యువతుల బాయ్ ఫ్రెండ్ ను సైతం అదుపులోకి తీసుకుని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండటంతో పలువురు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. చదువుకోమని తల్లిదండ్రులు కాలేజీలకు పంపిస్తే ఇలాంటి పనులు చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Visitors Are Also Reading