తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న స్టార్ డైరెక్టర్లు అందరిలో మేటి డైరెక్టర్ కృష్ణవంశీ.. ప్రస్తుతం ఆయన స్టార్ హోదాలో ఉన్నారు కానీ, ఒకప్పుడు ఇండస్ట్రీలో కనీసం ఒక పూట తిండి తినడానికి కూడా లేని పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఎంతో టాలెంట్ ఉన్న అవకాశం వచ్చేవరకు ఎదురు చూసాడు. ఎన్నో రోజులు పస్తులున్నాడు.. అలనాడు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే చాలా కష్టాలు ఉండేది. అలాంటి కష్టాలు అనుభవించారు కృష్ణవంశీ.
Advertisement
తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆర్జీవి వద్ద చేరకముందు కనీసం ఒక పూట తిండి తినలేని పరిస్థితుల్లో ఉన్నానని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు . ఆయన అప్పటికే భోజనం చేసి ఐదు రోజులు. కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇంకో ఐదు నిమిషాలు అయితే పడిపోయే పరిస్థితి. రోడ్డు పక్కన నిలబడి ఉన్నాను. ఇంటికి వెళ్తే ఇక జీవితంలో ఓడిపోయినట్టే.. తన మనసులో ఏవో ఆలోచనలు మెదులుతున్నాయి.. అంతలోనే బ్రహ్మాజీ వచ్చి భోజనం చేద్దాం రా అన్నాడు. మామూలుగా అయితే నేను ఎవరి దగ్గర తలవంచను. కానీ ఆ సమయంలో చాలా ఆకలి వేస్తోంది. చనిపోయే పరిస్థితి. ఇక బ్రహ్మాజీ పెట్టిన ఫుడ్ తినుకుంటూ అనుకున్నాను.
Advertisement
ఏమిచ్చి ఇతడి రుణం తీర్చుకోగలను. ఇక ఆయన తెలుగులో స్టార్ డైరెక్టర్ అయ్యాక !సింధూరం” చిత్రంలో బ్రహ్మాజీని హీరోగా పెట్టడానికి కారణం అదే. మంచి నటుడు, మంచి స్నేహితుడు కూడా. ఆ క్యారెక్టర్ కు న్యాయం చేస్తాడు అనిపించింది అందుకే హీరోని చేయాలని భావించాను. అంతేకాకుండా కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన “రంగమార్తాండ” చిత్రం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని తుదిమెరుగులు దిద్దుకుంటుంది.
also read:త్వరలో బెంగళూరు నుంచి మరో ప్రధాన నగరానికి వందే భారత్ ట్రైన్..!!